SIR
ఏపీలో ఓటర్ల లిస్టు మార్పులు, చేర్పులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సమయాన్ని ఈ నెల 24 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
నిజానికి ఈ గడువు మంగళవారం అంటే జూలై 14తోనే ముగిసిపోవాలి. కానీ, ఇంకా చాలా మంది ఓటర్ల వివరాలు నమోదు కావాల్సి ఉండటం వల్ల.. రాష్ట్ర ఎన్నికల అధికారి చేసిన రిక్వెస్ట్‌తో ఈ సమయాన్ని పొడిగించారు. దీనికి తగ్గట్టుగానే కొత్త డేట్లతో కూడిన షెడ్యూల్‌ను కూడా రిలీజ్ చేశారు.
కొద్ది రోజులుగా బీఎల్వోలు ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓటర్ల వివరాలను సరి చూస్తున్నారు. అయితే సోమవారం నాటికి ఏపీ వ్యాప్తంగా కేవలం 88 శాతం మంది ఓటర్ల డేటా మాత్రమే ఆన్‌లైన్‌లో రికార్డ్ అయింది. టైమ్ అయిపోతున్నా.. ఇంకా పనులు పూర్తి కాలేదు. అలాగే ఎన్యూమరేషన్ లిస్టులో ఎలాంటి తప్పులు ఉండకూడదనే ఉద్దేశంతో మరికొద్ది రోజులు సమయం ఇవ్వాలని రాజకీయ పార్టీలు.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కోరాయి. పార్టీల కోరికను, గ్రౌండ్ లెవల్‌లో ఉన్న పనుల ఒత్తిడిని గమనించిన ముఖేష్ కుమార్ మీనా.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో గడువు పెంచడానికి ఈసీ ఓకే చెప్పింది.
ఈ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన లెక్కలు బయటకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికారులు మొత్తం 4.16 కోట్లకు పైగా ఎన్యూమరేషన్ ఫామ్‌లను పంచగా, అందులో 3.69 కోట్ల మంది వివరాలను కంప్యూటర్లలో ఎంటర్ చేశారు. ఈ తనిఖీల్లో ఏపీ వ్యాప్తంగా 14,19,644 మంది ఓటర్లు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు.
అలాగే ఉద్యోగాలు, పెళ్లిళ్లు లేదా ఇతర కారణాలతో సుమారు 12,14,994 మంది ఓటర్లు తమ పాత ఇళ్లను ఖాళీ చేసి వేరే ఊర్లకు వెళ్లిపోయినట్లు తేలింది. అధికారులు ఇంటికి వెళ్లిన టైమ్‌లో 7,26,425 మంది ఓటర్లు తమకు అందుబాటులో లేరని నోట్ చేసుకున్నారు. ఇంకా మిగిలిపోయిన 9 శాతం పనులను ఈ పెంచిన లిమిట్‌లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన కొత్త డేట్ల ప్రకారం.. ఈ ఓటర్ల సర్వే ప్రక్రియ జూలై 24తో ముగుస్తుంది. ఆ తర్వాత జూలై 31వ తేదీన ఓటర్ల ఫస్ట్ లిస్టును బయటపెడతారు. ఈ లిస్టులో వారి పేరు ఉందో లేదో చూసుకుని.. ఏవైనా తప్పులున్నా, కొత్తగా పేరు నమోదు చేసుకోవాలన్నా జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రజల అప్లికేషన్లను సెప్టెంబరు 28 వ తేదీలోపు అధికారులు పరిశీలించి సరిచేస్తారు. అన్ని మార్పుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ఫైనల్ లిస్టును అక్టోబరు 3 న అధికారికంగా రిలీజ్ చేస్తారు. ఈ టైమ్ పెంచడం వల్ల ఎలాంటి తప్పులు లేని పక్కా ఓటర్ల లిస్టు తయారవుతుందని అధికారులు చెబుతున్నారు.
Mini Amazon Forest : అమరావతి గుండెల్లో పచ్చని అద్భుతం.. ముస్తాబవుతున్న మినీ అమెజాన్ అడవి
