AP Rajya Sabha : ఏపీలో రాజ్యసభ సీట్లపై క్లారిటీ..రేసులో ఉన్నది వీళ్లే

AP Rajya Sabha : ఏపీలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ల కేటాయింపుపై ఎన్డీఏ పార్టీల మధ్య లెక్క తేలింది. తెలుగుదేశం పార్టీ 3, జనసేన ఒక రాజ్యసభ స్థానం తీసుకోనున్నాయి

AP Rajya Sabha

రాజ్యసభ ఎన్నికల వేడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాల్లో సీట్ల కేటాయింపుపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. తాజాగా ఏపీలో నాలుగు రాజ్యసభ(AP Rajya Sabha) సీట్లపై క్లారిటీ వచ్చింది. మూడు స్థానాలను టీడీపీ, ఒక స్థానం జనసేనకు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూటమి అగ్రనేతల మధ్య సుదీర్ఘ భేటీ జరిగింది. ఈ భేటీలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్, మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. గతంలో వైసీపీ తరపున ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలతో పాటు టీడీపీ ఎంపీ సానా సతీష్‌ల పదవీ కాలం ముగుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయా స్థానాలను భర్తీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ నుంచి ఇద్దరు బీజేపీ అభ్యర్ధులు రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో.. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వలేమని తేల్చేసింది. దీంతో బీజేపీ వెనక్కి తగ్గక తప్పలేదు.

కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రావడంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెరిగింది. ఇప్పటికే అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్టు సమాచారం, అధికారిక ప్రకటన రాకున్నా ఏపీ రాజ్యసభ(AP Rajya Sabha) సభ్యుల్లో ఇద్దరు కమ్మా, ఒక కాపు, ఒక ఎస్సీ కి అవకాశం దక్కనుంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది.

టీడీపీ నుంచి సానా సతీష్(కాపు) , భాష్యం రామకృష్ణ (కమ్మ), దేవయ్య ( ఎస్సీ) పేర్లు ఖరారైనట్టు సమాచారం. అటు జనసేన నుంచి
ఆ సీటు లింగమనేని రమేష్‌కు దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కూటమి అభ్యర్దిగా ఏపీ నుంచి మాజీ ప్రధాని రాజ్యసభ పదవీకాలం ముగియడంతో సహా మరో ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

AP Rajya Sabha

కర్ణాటక నుంచి 2020లో ఎంపికైన దేవెగౌడ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ, జేడీఎస్ పొత్తులో భాగంగా దేవగౌడకు సీటు ఇవ్వాలని బీజేపీపై ఒత్తిడి ఉంది.అయితే టీడీపీ నుంచి రేసులో కిలారు రాజేష్, కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్ధన్, గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ, ఎస్సీ కోటాలో సీనియర్ నేత వర్ల రామయ్య పేర్లు కూడా వినిపించాయి.

AP Cabinet : ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. మంత్రి మండలి ఓకే చెప్పిన 37 ప్రతిపాదనలు ఏంటి?

Exit mobile version