Salakatla Brahmotsavams : సాలకట్ల,నవరాత్రి ఉత్సవాల డేట్ ఫిక్స్.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ రిలీజ్..

Salakatla Brahmotsavams : సెప్టెంబరు 15వ తేదీన సాలకట్ల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

Salakatla Brahmotsavams

కలియుగ వైకుంఠం తిరుమల గిరులన్నీ మళ్లీ భక్తి పారవశ్యంతో పులకరించిపోయే సమయం ఆసన్నమయింది. ఏడుకొండల వాడి నవరాత్రి ఉత్సవాల కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది శ్రీనివాసుడి భక్తులకు టీటీడీ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.

ఈసారి ఉత్సవాలను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్స్‌తో రంగంలోకి దిగింది.2026 సంవత్సరానికి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను టీటీడీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

ఈ ఇయర్ రెండు విడతలుగా సాగే ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాల వేడుకల్లో భాగంగా.. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Salakatla Brahmotsavams), ఆ తర్వాత అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత నేత్రపర్వంగా నిర్వహించబోతున్నారు.

ఈనెల సెప్టెంబరు 15వ తేదీన సాలకట్ల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఈఓ ముద్దాడ రవిచంద్ర అలాగే బోర్డు మెంబర్లు కలిసి ఈ ఉత్సవాల పూర్తి వివరాలతో స్పెషల్ బుక్‌లెట్‌ను రిలీజ్ చేశారు. ఈ బుక్‌లెట్‌లో ఆ సమయంలో జరిగే వాహన సేవలు, ప్రతిరోజూ జరిగే ముఖ్యమైన పూజా కార్యక్రమాల పూర్తి ఇన్‌ఫర్మేషన్‌ను భక్తులకు ఈజీగా అర్థమయ్యేలా పొందుపరిచారు.

Salakatla Brahmotsavams

తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. అటు సోషల్ మీడియా ద్వారా కూడా ఈ బ్రహ్మోత్సవాల వివరాలను ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఉన్న స్వామివారి భక్తులకు తెలిసే ఏర్పాట్లు చేశారు.

తిరుమల కొండ మీదకు వచ్చే లక్షలాది మంది భక్తులకు దివ్యమైన స్వామివారి వాహన సేవలతో పాటు.. అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించడానికి టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది. మీరు కూడా ఆ శ్రీనివాసుడి కృపకు పాత్రులు కావాలనుకుంటే వెంటనే తిరుమల ప్రయాణానికి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.

Jagan Padayatra : జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్..సేమ్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

Exit mobile version