Central Govt Jobs : ఇంటర్‌తోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్.. ఇలా అప్లై చేసేయండి..

Central Govt Jobs : డీఈఓ, డీఈఓ గ్రేడ్ ఎ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ స్ట్రీమ్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.

Central Govt Jobs

కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్‌తోనే గవర్నమెంట్ జాబ్‌లో పాతుకుపోవాలని కలలు కనే నిరుద్యోగులకు స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న యూత్‌కు సరికొత్త ఆశలు చిగురింపజేస్తూ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) 2026 నోటిఫికేషన్‌ను ఈనెల సెప్టెంబర్ 7 వ తేదీన అఫీషియల్‌గా విడుదల చేసింది.

ఈ భారీ వేట ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ సెంట్రల్ గవర్నమెంట్‌ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లు, కీలక ఆఫీసుల్లో సుమారు 2,536 టెంపరరీ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇందులో లోవర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), అలాగే డీఈఓ గ్రేడ్ ఎ ( DEO Grade A)వంటి పోస్టులు ఉన్నాయి.

ఈ ఆఫర్‌కు సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియల ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచే పోర్టల్ ఓపెన్ అయిపోయింది కాబట్టి.. అర్హులైన కేండిడేట్స్ అక్టోబర్ 7 రాత్రి 11 గంటల వరకు అప్లికేషన్లు సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి అక్టోబర్ 8 వ తేదీ రాత్రి 11 గంటల వరకు టైమ్ ఇచ్చారు. ఒకవేళ ఫామ్ ఫిల్ చేసినపుడు ఏమైనా పొరపాట్లు జరిగితే, వాటిని సరిదిద్దుకోవడానికి అక్టోబర్ 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు స్పెషల్ కరెక్షన్ విండోను కూడా అందుబాటులో ఉంటుంది.

డీఈఓ, డీఈఓ గ్రేడ్ ఎ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ స్ట్రీమ్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల ఏజ్ 2026, ఆగస్టు 1 నాటికి 18- 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే 1999 ఆగస్టు 2 నుంచి 2008 ఆగస్టు 1 మధ్య జన్మించిన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు. అలాగే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ కేండిడేట్స్‌కు 10 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

అప్లికేషన్లు అన్నీ ఆన్‌లైన్ మోడ్‌లోనే పంపాల్సి ఉంటుంది. జనరల్,ఈడబ్ల్యూఎస్( EWS), ఓబీసీ( OBC) కేటగిరీల కేండిడేట్స్ రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ( PwBD), ఎక్స్-సర్వీస్‌మెన్, అలాగే మహిళా కేండిడేట్స్‌కు ఎలాంటి ఫీజూ లేదు. వీరికి పూర్తి మినహాయింపు ఇచ్చారు. సెలెక్షన్ ప్రాసెస్ అంతా టైర్ -I, టైర్-II రిటెన్ ఎగ్జామ్స్ ఆధారంగానే జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ssc.gov.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

Central Govt Jobs

ఈ రెండూ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ టెస్ట్‌లు (CBT) కాగా, పరీక్షల తేదీలను SSC త్వరలోనే అనౌన్స్ చేస్తుంది. అభ్యర్థులు జాబ్ సాధించాలంటే ప్రతీ కేటగిరీలోనూ క్వాలిఫై అవ్వాల్సిందే. అంతేకాకుండా సెక్షన్-1, సెక్షన్-2లలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.

ఇంటర్ క్వాలిఫికేషన్‌తో సెంట్రల్ గవర్నమెంట్‌లో గెజిటెడ్ స్థాయికి వెళ్లే మంచి లైఫ్ సెటిల్మెంట్ దొరికే అవకాశం ఇది. కాబట్టి లాస్ట్ మినిట్ వరకూ వెయిట్ చేయకుండా అప్లై చేసుకోండి. అలాగే అస్సలు లేట్ చేయకుండా వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి.

Liechtenstein : హైదరాబాద్ కంటే చిన్న దేశం.. కానీ ఆ విషయంలో మాత్రం ఈ కంట్రీ టాప్..

Exit mobile version