Jagan Padayatra : జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్..సేమ్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
Jagan Padayatra : 2014 ఎలక్షన్సలో ఓటమి తర్వాత డీలా పడిన తమ పార్టీ శ్రేణుల్లో జగన్ పాద యాత్ర కొత్త ఊపిరి ఊదడమే కాకుండా విలేజ్ లెవల్ వరకు పార్టీ నెట్‌వర్క్‌ను చాలా స్ట్రాంగ్‌గా మార్చింది.
Jagan Padayatra
ఏపీ రాజకీయాల్లో మరో భారీ పొలిటికల్ సునామీకి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెరలేపారు. చాలా కాలంగా అనుకుంటున్న పాదయాత్రపై క్లారిటీ ఇచ్చి కేడర్‌లో జోష్‌ను నింపారు. తాడేపల్లిలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జరిగిన భేటీలో ..2027 సెప్టెంబర్, అక్టోబర్ నెలలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్ క్లారిటీ ఇచ్చారు.
తమ వైసీపీ హయాంలో ఐదేళ్ల పాలనకు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి పాలనకు మధ్య ఉన్న తేడాను జనాలు క్లియర్‌గా గమనిస్తున్నారని, ప్రతీ ఇంట్లోనూ ఇదే చర్చ నడుస్తోందని జగన్ చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చిన తమ పాలన గురించి.. తమ కార్యకర్తలు ప్రజల ముందు ధైర్యంగా, గర్వంగా చెప్పుకోగలరని అన్నారు.
కాగా గతంలో జగన్ చేపట్టిన పాదయాత్ర ఏపీ రాజకీయ చరిత్రలోనే ఒక ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయిందనే చెప్పొచ్చు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో 2017 నవంబర్ 6న ప్రారంభమైన ఈ ప్రజా సంకల్ప యాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2019 జనవరి 9న ముగిసింది.
మొత్తం 341 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్రలో జగన్ 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఏపీలోని 13 జిల్లాల మీదుగా 134 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 2,516 గ్రామాలను కవర్ చేస్తూ సాగిన పాదయాత్రలో సుమారు రెండు కోట్లకు పైగా ప్రజలను డైరెక్టుగా కలుసుకున్నారు. ఆ సమయంలోనే 124 భారీ బహిరంగ సభల్లో ప్రసంగించి జనాల్లో తనదైన ముద్ర వేశారు.
ఈ పాదయాత్ర జగన్ పొలిటికల్ కేరీర్‌ను ఊహించని మలుపు తిప్పడమే కాదు..ఏకంగా ఆయనను తిరుగులేని ఒక మాస్ లీడర్‌గానూ నిలబెట్టింది. 2014 ఎలక్షన్స్‌లో ఓటమి తర్వాత డీలా పడిన తమ పార్టీ శ్రేణుల్లో జగన్ పాద యాత్ర కొత్త ఊపిరి ఊదడమే కాకుండా విలేజ్ లెవల్ వరకు పార్టీ నెట్‌వర్క్‌ను చాలా స్ట్రాంగ్‌గా మార్చింది.
పాదయాత్ర సాగుతున్న సమయంలో ప్రజలతో మాట్లాడటం వల్ల వారి కష్టాలను, వారి సమస్యలను తెలుసుకున్న జగన్.. నవరత్నాలు అనే సంక్షేమ పథకాల ఆలోచన రూపొందించారు. ఈ పథకాల హామీలే జనాల్లోకి విపరీతంగా దూసుకెళ్లి, వైసీపీకి అప్పట్లో ప్రజాదరణను పెంచేశాయి.
ఈ పాదయాత్ర తెచ్చిన మైలేజ్ ఆ తర్వాత వచ్చిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రేంజ్లో వర్కవుట్ అయిందో అందరికీ తెలిసిందే . ఏకంగా 175 సీట్లకు.. 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుని వైసీపీ హిస్టారికల్ విక్టరీని నమోదు చేసింది.

తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలాగా పాదయాత్రను ఒక పొలిటికల్ వెపన్‌గా మలుచుకుని అధికార పీఠాన్ని అధిరోహించారు. ఇప్పుడు మళ్లీ 2027లోనూ అదే పాదయాత్ర సెంటిమెంట్ అండ్ స్ట్రాటజీని నమ్ముకుని మళ్లీ గద్దెనెక్కడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
అయితే అప్పటికీ ఇప్పటికీ ఓటర్ మైండ్ సెట్ పూర్తిగా మారింది. 2017కి 2027కి పదేళ్ల తేడానే కాదు..ప్రజల ఆలోచనా విధానంలో కూడా మార్పు వచ్చింది కాబట్టి..ఈసారి పాదయాత్ర సెంటిమెంట్ వర్కవుట్ అయ్యే అవకాశాలు చాలా తగ్గినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమయినా వచ్చే ఎలక్షన్స్‌లో ఏపీ రాజకీయాలలో టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నారు.
Central Govt Jobs : ఇంటర్‌తోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్.. ఇలా అప్లై చేసేయండి..





