TTD : శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేస్తున్నారా? టీటీడీ రిలీజ్ చేసిన కొత్త అప్‌డేట్ ఇదే..

TTD : సెప్టెంబర్ మాసానికి సంబంధించిన దర్శన టికెట్లు, వివిధ రకాల సేవలు , వసతి గదుల కోటా బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో పూర్తి టైమ్ టేబుల్‌ను టీటీడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు

TTD

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకుని గోవిందుడి ఆశీస్సులు తీసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఏ ప్లానింగ్ లేకుండా వెళ్తే అక్కడ దర్శనం దొరకడం చాలా కష్టం. అందుకే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండటానికి టీటీడీ(TTD) ముందుగానే టికెట్లు, గదుల కోటాను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తూ ఉంటుంది.

తాజాగా సెప్టెంబర్ మాసానికి సంబంధించిన దర్శన టికెట్లు, వివిధ రకాల సేవలు , వసతి గదుల కోటా బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో పూర్తి టైమ్ టేబుల్‌ను టీటీడీ(TTD) అధికారులు అధికారికంగా ప్రకటించారు. జూన్ 18 నుంచి జూన్ 24 వరకు రోజుకో కేటగిరీ చొప్పున ఈ బుకింగ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ తేదీలను ముందుగానే నోట్ చేసి పెట్టుకుంటే కరెక్ట్ టైమ్‌కి లాగిన్ అయి శ్రీవారి దర్శన టికెట్లు పొందొచ్చు.

ముందుగా సుప్రభాతం, తోమాల, అర్చన వంటి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ ప్రాసెస్.. జూన్ 18 వతేదీన ఉదయం 10 గంటల నుంచి మొదలవుతుంది. ఈ సేవా ఎలక్ట్రానిక్ డిప్‌ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు పేరు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో పేరు వచ్చిన వాళ్లు జూన్ 22 మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి సాధారణ ఆర్జిత సేవా టికెట్లు జూన్ 22 వ తేదీన ఉదయం 10 గంటలకు, అలాగే వర్చువల్ సేవలకు సంబంధించిన దర్శన స్లాట్లు కూడా జూన్ 22 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లోకి వస్తాయి.

ఆ తర్వాత జూన్ 23న మరికొన్ని ముఖ్యమైన కోటాలను రిలీజ్ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఓపెన్ అవుతాయి.

TTD

అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న భక్తుల కోసం ఉచిత స్పెషల్ దర్శన టోకెన్లను టీటీడీ అధికారులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

భక్తులు ఎక్కువగా ఎదురుచూసే రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. చివరిగా తిరుమల , తిరుపతిలో ఉండే వసతి గదుల బుకింగ్స్ జూన్ 24న మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అయితే భక్తులు టీటీడీ(TTD) అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Mind Reading AI : నెక్స్ట్ ఏం చేస్తావో చెప్పేసే ఏఐ వస్తే..మైండ్ రీడింగ్ నిజంగానే సాధ్యం అవుతుందా?

Exit mobile version