Vijay Vijayawada Tour
దసరా శరన్నవరాత్రుల శోభతో కళకళలాడుతున్న విజయవాడ సిటీ మరికొన్ని గంటల్లో మరో రెండు రాష్ట్రాల అత్యున్నత స్థాయి సమావేశానికి వేదికగా మారనుంది. తమిళనాడు సీఎం విజయ్ ఈరోజు మధ్యాహ్నం విజయవాడలో పర్యటించనున్నారు(Vijay Vijayawada Tour). ఈ మధ్యాహ్నం బెజవాడ చేరుకున్న తర్వాత.. రెండు రాష్ట్రాల జల వివాదాలు, నీటి కేటాయింపులపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో విజయ్ సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా చెన్నై నగరానికి వాటర్ అందించే పవిత్రమైన తెలుగు గంగ ప్రాజెక్టు సామర్థ్యం, వాటర్ రిలీజ్ వంటి ఛాలెంజెస్ చర్చకు రానున్నాయి. ఇద్దరు సీఎం భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంది. విజయ్ అండ్ పవన్ కాంబో వార్తలతో ఇప్పుడు మూవీ అండ్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారిక మంతనాలన్నీ పూర్తయ్యాక, విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి ఇద్దరు సీఎంలు ఇంద్రకీలాద్రికి పయనం కాబోతున్నారు.
మరోవైపు విజయవాడలో ప్రస్తుతం దసరా సంబరాలతో జోష్ మీద ఉంది. దీనిలో భాగంగా బసవ పున్నయ్య స్టేడియం, పున్నమి ఘాట్లలో విజయవాడ ఉత్సవ్ 2.0 పేరుతో జరుగుతున్న ఉత్సవాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విఘ్నేశ్వరుడి పాటపై గోల్డెన్ గర్ల్స్ టీమ్ చేసిన ప్రదర్శనతో పాటు జానపద డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇంద్రకీలాద్రి దర్శనం తర్వాత సీఎం చంద్రబాబు, సీఎం విజయ్(Vijay Vijayawada Tour) ఇద్దరూ కలిసి పున్నమి ఘాట్‌ను సందర్శించి ఈ కల్చరల్ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మొత్తంగా విజయ్ విజయవాడ పర్యటన రెండు పొరుగు రాష్ట్రాల అనుబంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Not Served With Love : వడ్డించే మనస్సుతో జాగ్రత్త..మీలోని పాజిటివ్ ఎనర్జీ నాశనం కాకుండా ఏం చేయాలి?
