Metro Rail : విశాఖ,విజయవాడలో మెట్రో పరుగులకు ప్లాన్ ఫిక్స్..రూ.21,616 కోట్లతో మారబోతున్న 2 సిటీల ఫేట్..

Metro Rail : విశాఖపట్నంలో ఫస్ట్ స్టేజ్‌ కింద 46.23 కిలోమీటర్ల వరకూ రూ.11,498 కోట్ల అంచనాతో మెట్రో లైన్స్ ఏర్పాటు కాబోతున్నాయి.

Metro Rail

విశాఖపట్నం, విజయవాడ సిటీల రూపురేఖలు మొత్తం మారబోతున్నాయి. ట్రాఫిక్ జామ్‌లు, పొల్యూషన్‌కి చెక్ పెడుతూ.. జర్నీ చాలా స్పీడ్‌గా, ఈజీగా సాగిపోయేలా మెట్రో రైల్ ప్రాజెక్టులు కొత్త రూపు దాల్చుతున్నాయి. చాలా కాలంగా పేపర్లకే పరిమితమైన ఈ రెండు నగరాల మెట్రో కల, ఇప్పుడు నిజంగా మారబోతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మెట్రో పనులు స్పీడ్‌గా ముందుకు కదులుతున్నాయి.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంపించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (DPR) క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, ఫైనల్ అప్రూవల్స్ కోసం ఎకానమిక్ ఎవల్యూషన్ డివిజన్‌కు పంపింది.

రూ.21,616 కోట్ల అంచనా వ్యయంతో ఫస్ట్ స్టేజ్‌లోనే ఏకంగా 84.63 కి.మీటర్ల వరకూ మెట్రో ట్రాక్‌లను అందుబాటులోకి తేవడమే టార్గెట్‌గా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. దీనివల్ల విశాఖ, విజయవాడ నగరాల్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా, బిజినెస్ స్కోప్, ఎకానమీ కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాయి.

ఈ మెట్రో ప్రాజెక్టును జాయింట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో చేపడుతున్నారు. అంటే మొత్తం వ్యయంలో కేంద్రం 20 శాతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు భరిస్తాయి. మిగిలిన 60 శాతం నిధులను వివిధ ఫైనాన్సియల్ కంపెనీలు , విదేశీ బ్యాంకుల నుంచి అప్పుల రూపంలో సమీకరించనున్నారు.

కొన్ని ఇంటర్నేషనల్ బ్యాంకులు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అంతేకాకుండా, పనులు ఏమాత్రం ఆలస్యం కాకుండా ఉండటానికి 40 శాతం వరకు టెండరింగ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్ కార్పొరేషన్‌కు పచ్చజెండా ఊపింది.

విశాఖపట్నంలో ఫస్ట్ స్టేజ్‌ కింద 46.23 కిలోమీటర్ల వరకూ రూ.11,498 కోట్ల అంచనాతో మెట్రో(Metro Rail) లైన్స్ ఏర్పాటు కాబోతున్నాయి. స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఒక రూట్ అలాగే గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు రెండో రూట్ ఏర్పాటు చేయడానికి..అలాగే తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు మూడో కారిడార్‌గా వీటిని డిజైన్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్‌తో పాటు సిటీలో రోజువారీ రాకపోకలు సాగించేవారికి ఇది లైఫ్ లైన్‌లా మారనుంది.

ఇక విజయవాడలో ఫస్ట్ స్టేజ్‌ కింద 38.40 కిలోమీటర్ల పొడవునా 10,118 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మెట్రో కారిడార్లు నిర్మించబోతున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ వరకు ఒక కారిడార్ అలాగే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచే మొదలై పెనమలూరు వరకు మరో కారిడార్ రాబోతున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ని సిటీ మధ్య భాగానికి కనెక్ట్ చేయడం వల్ల ప్రయాణికులకు టైమ్ చాలా సేవ్క అవుతుంది.

Metro Rail

కాగా విజయవాడలో ఈ మెట్రో ప్రాజెక్టు కోసం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (SIA) సర్వే కూడా స్పీడ్ అందుకుంది. బందరు రోడ్, ఏలూరు రోడ్, గన్నవరం, పెనమలూరు ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, రెవెన్యూ టీమ్స్ కలిసి సర్వే చేస్తున్నాయి.

రెండు కారిడార్ల పరిధిలో కోచ్ డిపోలు, మెట్రో(Metro Rail) స్టేషన్ల కన్‌స్ట్రక్షన్ కోసం సుమార 80 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ సర్వే పూర్తయిన వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి జిల్లా యంత్రాంగం రెడీగా ఉంది. కేంద్రం నుంచి పూర్తి స్థాయి క్లియరెన్స్ రాగానే ఫస్ట్ స్టేజ్‌ పనులకు గ్రాండ్‌గా శంకుస్థాపన జరగనుంది.

Splitting : చిన్న గొడవకే బంధానికి దూరంగా వెళ్లే మైండ్‌సెట్.. ఇది డిటాచ్‌మెంటా లేక మానసిక బలహీనతా?

Exit mobile version