UPI : యూపీఐ చెల్లింపులు సిబిల్‌ స్కోర్‌ను తగ్గిస్తాయా? లోన్ రావడం కూడా కష్టమవుతుందా?

UPI : ఇప్పుడు మనమంతా టీ కొట్టు నుంచి పెద్ద షోరూమ్‌ల వరకు డబ్బులతో పనిలేకుండా కేవలం స్మార్ట్‌ఫోన్‌తోనే ట్రాన్జాక్షన్స్ కానిచ్చేస్తున్నాం.

UPI

ఇప్పుడు మనమంతా టీ కొట్టు నుంచి పెద్ద షోరూమ్‌ల వరకు డబ్బులతో పనిలేకుండా కేవలం స్మార్ట్‌ఫోన్‌తోనే ట్రాన్జాక్షన్స్ కానిచ్చేస్తున్నాం. అయితే, మనం చేసే ఈ చిన్న చిన్న యూపీఐ (UPI) పేమెంట్లు మన క్రెడిట్ స్కోర్‌ను , సిబిల్ (CIBIL) రేటింగ్‌ను దెబ్బతీస్తాయా అన్న డౌట్ చాలా మందిలో ఉంది. దీనిపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో, అసలు బ్యాంకులు మన డిజిటల్ లావాదేవీలను ఎలా గమనిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

నిజానికి మనం చేసే యూపీఐ పేమెంట్స్ మీ సిబిల్ స్కోర్‌పై డైరెక్టుగా ఎటువంటి ప్రభావాన్ని చూపించవు. మీరు రోజుకు ఎన్ని వందల లావాదేవీలు చేసినా, అది మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచదు లేదా తగ్గించదు. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ అనేది మీరు తీసుకున్న అప్పులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు ,వాటిని తిరిగి చెల్లించే తీరుపై ఆధారపడి ఉంటుంది.

అయితే, మీరు ఏదైనా పెద్ద లోన్ కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు మాత్రం యూపీఐ(UPI) హిస్టరీ ఒక కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం చాలామందికి తెలీదు.లోన్ ఇచ్చేవాళ్లు కానీ బ్యాంకులు కానీ మీకు లోన్ ఇచ్చే ముందు కేవలం సిబిల్ స్కోర్‌ను మాత్రమే చూడవు, మీ ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను కూడా అవి క్లియర్‌గా పరిశీలిస్తాయి.

మీ ఖర్చుల తీరెలా ఉంది? వచ్చిన జీతం వచ్చినట్లే ఖర్చు పెడుతున్నారా? నెలాఖరు వరకు అకౌంట్‌లో కొంత నిల్వ (Balance) ఉంటుందా? అని జాగ్రత్తగా గమనిస్తారు. ఒకవేళ మీ స్టేట్‌మెంట్ నిండా ఎక్కువగా రూ. 10, రూ. 20 వంటి చిన్న చిన్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉండి, నెలాఖరుకు మీ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ కనిపిస్తే మాత్రం మీకు ఆర్థిక క్రమశిక్షణ సరిగ్గా లేదని బ్యాంకులు భావించే ఛాన్స్ ఉంది.

UPI

అంతేకాకుండా, బ్యాంక్ స్టేట్‌మెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల లోన్ ప్రాసెసింగ్‌లో టెక్నికల్ ఇబ్బందులు ఎదురుకావొచ్చు. తరచుగా మీ అకౌంట్‌లో డబ్బులు లేకపోవడం వల్ల బ్యాంకులు మిమ్మల్ని ‘హై రిస్క్’ కేటగిరీలో పెట్టే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల మీకు లోన్ మంజూరు కాకపోయే అవకాశం ఉంది.

ఒకవేళ మంజూరు అయినా కూడా ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి, యూపీఐ ద్వారా క్రెడిట్ స్కోర్ తగ్గకపోయినా.. మీ బ్యాంకింగ్ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి మాత్రం చిన్న చిన్న ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీలైనంత వరకు అకౌంట్‌లో కొంత డబ్బులను మిగిల్చుకోవడం మంచిది.

RCB : టాప్ లేపిన ఆర్ సీబీ…చిత్తుగా ఓడిన లక్నో

Exit mobile version