Just SportsLatest News

RCB : టాప్ లేపిన ఆర్ సీబీ…చిత్తుగా ఓడిన లక్నో

RCB : డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టే దుమ్మురేపుతోన్న ఆర్ సీబీ మరోసారి ఆల్ రౌండ్ షోతో మెరిసింది

RCB

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టే దుమ్మురేపుతోన్న ఆర్ సీబీ(RCB) మరోసారి ఆల్ రౌండ్ షోతో మెరిసింది. టోర్నీ సాగేకొద్దీ అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తూ అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో దుమ్మురేపింది. రసిక్ సలం దార్, భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరగడంతో లక్నో చేతులెత్తేసింది. ఈ విజయంతో బెంగళూరు టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే ఆర్సీబీ తొలిసారి విరాట్ కోహ్లీని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ కు ఈసారి మెరుపు ఆరంభం దక్కలేదు.

ఫామ్ లో ఉన్న మార్కరమ్ 12 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. మరో ఓపెనర్ మిఛెల్ మార్ష్ ధాటిగా ఆడుతున్నా.. మరోవైపు లక్నో వరుసగా వికెట్లు కోల్పోయింది. పంత్ (1), పూరన్ (1), అబ్జుల్ సమద్ డకౌటయ్యారు. మిఛెల్ మార్ష్ , ఆయుశ్ బదోనీతో కలిసి ఆదుకునే ప్రయత్నం చేశాడు.వీరిద్దరూ 36 పరుగులు జోడించారు. మార్ష్ (40) పరుగులకు వెనుదిరిగినా బదోనీ 38 పరుగులు చేశాడు. అలాగే ముకుల్ చౌదరి మరోసారి చివర్లో మెరుపులు మెరిపించాడు.

అతను ధాటిగా ఆడిన కారణంగానే లక్నో స్కోరు 140 దాటగలిగింది. చివర్లో టెయిలెండర్లు వెంటవెంటనే ఔటవడంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. రసిక్ సలం దార్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. 4 వికెట్లు పడగొట్టాడు. మార్కరమ్, బదోనీ, ముకుల్ చౌదరి, అవేశ్ ఖాన్ లను ఔట్ చేశాడు. ఇదిలా ఉంటే వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా 3 కీలక వికెట్లతో లక్నోను దెబ్బకొట్టాడు.

RCB
RCB

తర్వాత ఛేజింగ్ లో ఫిల్ సాల్ట్(7) త్వరగానే ఔటైనా కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ క్లాసిక్ షాట్లతో అలరించాడు. వరుస బౌండరీలతో టార్గెట్ ఒత్తిడి కనిపించకుండా మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేశాడు. కోహ్లీ కేవలం 34 బంతుల్లోనే 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 49 పరుగులు చేశాడు.

కోహ్లీ, పడిక్కల్ రెండో వికెట్ కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లీ ఔటైన తర్వాత పడిక్కల్ (10) కూడా వెనుదిరగ్గా, పటిదార్ 13 బంతుల్లో 27 , జితేశ్ శర్మ 9 బంతుల్లో 23 పరుగులు చేశారు. వీరిద్దరూ ఔటవడంతో బెంగళూరు ఐదు వికెట్లు కోల్పోయినా అప్పటికే విజయం ఖరారైంది.

తర్వాత రూథర్ ఫర్డ్, టిమ్ డేవిడ్ ఆర్సీబీ విజయాన్ని పూర్తి చేశారు. చివరికి బెంగళూరు 15.1 ఓవర్లలోనే టార్గెట్ ఛేజ్ చేసింది. ఈ విజయంతో బెంగళూరు 8 పాయింట్లతో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ కంటే మెరుగైన రన్ రేట్ కారణంగా టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.

Lokesh:విమర్శల నుంచి విజయ శిఖరాల వరకూ..ఇదీ లోకేష్ అసలు మార్క్!

Related Articles

Back to top button