Gold And Silver : మళ్లీ పడిపోయిన బంగారం, వెండి ధరలు..ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి?

Gold And Silver : దేశంలో గోల్డ్ ,సిల్వర్ ధరలు ఊహించని విధంగా దిగి వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో నవంబర్ 2వ తేదీ నాటి 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం, వెండి రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Gold And Silver

కొద్ది రోజులుగా కొండెక్కి కూర్చుని సామాన్యుడికి చుక్కలు చూపిస్తూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ రెండు రోజులుగా దారిలోకి వస్తున్నాయి. సరిగ్గా దీపావళి పండుగ దగ్గర పడుతున్న సమయంలో మార్కెట్లో బంగారం రేట్లు పడిపోతుండటం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. కొన్ని నెలలుగా అప్పుడప్పుడు కొద్దిగా తగ్గినట్లు కనిపించినా, వారం రోజులుగా మాత్రం ధరలు ఏకంగా కుప్పకూలుతున్నాయి.

అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు సద్దుమణగడం, అమెరికా డాలర్ విలువ ఊహించని రేంజ్‌లో బలపడటం, క్రూడ్ ఆయిల్ రేట్లు స్థిరంగా ఉండటంతో గ్లోబల్ వైడ్‌గా పసిడి మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. రాబోయే రోజుల్లో గోల్డ్ ధరలు ఇంకా దారుణంగా పడిపోతాయనే భయంతో బడా ఇన్వెస్టర్లు అంతా తమ దగ్గరున్న గోల్డ్ స్టాక్స్‌ను విక్రయించేస్తున్నారు. దీంతో మార్కెట్లో అమ్మకాల మోత మోగిపోవడంతో బంగారం ధరల గ్రాఫ్ దారుణంగా కిందకు పడిపోతోంది.

దీనిలో భాగంగానే నవంబర్ 2 న తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర నగరాల్లో పుత్తడి, వెండి ధరలను గమనించి కొనుగోలుదారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేట్ రూ.1లక్ష38వేల870 వద్ద కొనసాగుతుండగా, జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ కాస్ట్ రూ.1లక్ష27వేల290గా నమోదైంది.

సరిగ్గా ఇదే ధరలు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ , విశాఖపట్నం, రాజమండ్రిలో కూడా కొనసాగుతున్నాయి. ఇక చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా 24 క్యారెట్లు రూ.1లక్ష38వేల870గానూ, 22 క్యారెట్ల రేటు రూ.1లక్ష27వేల290 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.1లక్ష39వేల20గా ఉండగా, 22 క్యారెట్ల రేటు రూ.1లక్ష27వేల290 వద్ద స్థిరపడింది.

మరోవైపు చూస్తే పసిడి బాటలోనే సిల్వర్ కూడా భారీగా వెనక్కి తగ్గుతోంది. గతంలో రికార్డు స్థాయిలో నింగినంటిన సిల్వర్ కాస్ట్ ఇప్పుడు కొద్దికొద్దిగా దిగివస్తోంది. హైదరాబాద్‌లో నిన్న రూ.2 లక్షల మార్కు వద్ద స్థిరపడిన కేజీ సిల్వర్ కాస్ట్ నేటికి రూ.1లక్ష99వేల900కి పడిపోయింది. చెన్నై, బెంగళూరు సిటీల్లో కూడా కిలో సిల్వర్ రేటు రూ.1లక్ష99వేల900 వద్ద కొనసాగుతోంది. గోల్డ్ అండ్ సిల్వర్(Gold And Silver) కొనడానికి ప్లాన్ చేస్తున్న వారికి, మెయిన్‌గా పండుగ షాపింగ్ చేసేవారికి ఈ ధరల పతనం నిజంగానే ఒక దీపావళి గిఫ్ట్‌లా మారబోతోందనడంలో ఎలాంటి డౌట్ లేదు.

What Women Want In A Man : మీలో ఈ లక్షణాలున్నాయా? అయితే మిమ్మల్ని ఏ అమ్మాయి కూడా వదులుకోదు..

↑
Exit mobile version