What Women Want In A Man : మీలో ఈ లక్షణాలున్నాయా? అయితే మిమ్మల్ని ఏ అమ్మాయి కూడా వదులుకోదు..

What Women Want In A Man : అమ్మాయిలు తమ జీవితంలో ఏమాత్రం వదులుకోవడానికి ఇష్టపడని అబ్బాయిలో ఉండాల్సిన ప్రత్యేక లక్షణాలు సైకాలజీ విశ్లేషణ ఇక్కడ చదవండి.

What Women Want In A Man

ఏ రిలేషన్‌లో అయినా ఎవరినైనా ఇష్టపడటానికి, ఆ ఇష్టాన్ని లైఫ్ లాంగ్ గుండెల్లో దాచుకోవడానికి చాలా తేడా ఉంటుంది. డేటింగ్ ప్రపంచంలో, రిలేషన్‌షిప్ సైకాలజీలో ఎవరితోనైనా లైఫ్‌ను పంచుకోవాలని లేదంటే జీవితాన్ని పంచుకుంటున్న అమ్మాయిలు ఆలోచించేటప్పుడు కొన్ని క్వాలిటీలను బేరీజు వేసుకుంటారు.

బయటకు కనిపించే ఆకర్షణలు, మాటల గారడీ కంటే, ఒక మగాడి ఇంటర్నల్ పర్సనాలిటి ఆ రిలేషన్‌కి ఎంత సేఫ్టీని ఇస్తుందనేదే ఇక్కడ అసలైన మ్యాటర్. ప్రతీ అమ్మాయి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నా కూడా, తన లైఫ్‌లో దొరికిన ఏ అమ్మాయి(What Women Want In A Man) అయినా సరే వదులుకోలేనంతగా ఇష్టపడాలంటే అతనిలో కచ్చితంగా కొన్ని లక్షణాలు ఉండాలని సైకాలజిస్టులు చెబుతున్నారు.

సమస్యలు నలువైపుల నుంచి చుట్టుముడుతుంటే కొంతమంది భయంతో ఊగిపోతుంటారు. కానీ అలాంటి క్లిష్టమైన సమయంలో కూడా ఏ మాత్రం తడబడకుండా, ఎంతో కూల్‌గా ఆ పరిస్థితిని హ్యాండిల్ చేసే మగవారంటే అమ్మాయిలు ఇష్టపడుతుంటారని సైకాలజిస్టులు అంటున్నారు.

కష్ట సమయంలో పార్ట్‌నర్ పక్కన అలా గ్రేస్ కంట్రోల్‌లో ఉండే కూల్ మనిషి ఉంటే చాలు,వారిలో కూడా సగం భయం ఆటోమేటిక్‌గా ఆవిరైపోతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇక తన ముందే ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, వేరే అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడటం వంటివి చేసే మగవారంటే అమ్మాయిలకు నచ్చరు.

తన పార్ట్‌నర్ తన ముందు ఎలాంటి ముసుగు లేకుండా, తనను ఎలాంటి జడ్జ్‌మెంట్‌కు గురి చేయకుండా తన ఎమోషన్స్‌కు వాల్‌లాగా నిలబడే మగవారి ముందు చాలా సేఫ్టీగా ఉంటారు. అలాంటి ఎమోషనల్ సేఫ్టీని ఎవరు ఇవ్వగలరో అలాంటి వ్యక్తిని వదిలేయాలని ఏ అమ్మాయి కూడా కలలో కూడా అనుకోదు.

అంతేకాదు ఎక్కడ తన సెల్ఫ్ రెస్పెక్ట్‌ను కాపాడుకోవాలో, ఏ విషయంలో హెల్దీ బౌండరీస్ గీసుకోవాలో క్లియర్‌గా తెలిసిన పురుషులంటే మహిళలకు ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది. లైఫ్ పట్ల ఎలాంటి క్లారిటీ లేకుండా గాలికి తిరిగే వారి కంటే, తమకంటూ ఒక మంచి గోల్ ఏర్పరచుకుని దానిని సాధించే వరకు వెనకడుగు వేయని పట్టుదల ఉన్న మగవారితో లైఫ్ జర్నీ చేయాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.

అయితే ఇవన్నీ ఉన్నా కూడా ఏ రిలేషన్ అయినా కూడా కేవలం రూల్స్‌పైనే నడవదు. పరస్పర గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకునే మెచ్యూరిటీ, గుడ్డి నమ్మకం కంటే నిజాయితీతో కూడిన అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడే ఏ బంధమైనా లైఫ్ లాంగ్ హ్యాపీగా గడుస్తుంది.

Over-Interference : బంధాల్లో ఊపిరాడనివ్వని అతి జోక్యం.. ఓవర్ ఇంటర్‌ఫియరెన్స్‌తో ముంచుకొచ్చే ముప్పు ఇదే..

↑
Exit mobile version