Gold Price : గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price : కొన్ని రోజులుగా అప్ అండ్ డౌన్ రేట్లతో కొనుగోలుదారులలో అయోమయాన్ని క్రియేట్ చేస్తున్న పసిడి ధరలు మరోసారి నేలకు దిగొచ్చాయి.

Gold Price

పుత్తడి కొందామని ప్లాన్ చేసుకుంటున్న వారికి, గోల్డ్ లవర్స్‌కు వీక్ స్టార్టింగ్లోనే బులియన్ మార్కెట్ అదిరిపోయే శుభవార్త మోసుకొచ్చింది. కొన్ని రోజులుగా అప్ అండ్ డౌన్ రేట్లతో కొనుగోలుదారులలో అయోమయాన్ని క్రియేట్ చేస్తున్న పసిడి ధరలు మరోసారి నేలకు దిగొచ్చాయి.

కేవలం బంగారం మాత్రమే కాదు..దాంతో పాటు సిల్వర్ కూడా భారీగానే పతనమై అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లలో చోటు చేసుకున్న అనుకోని పరిణామాలు, ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులు, వేగంగా మారే కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్లు ఇవన్నీ కలిసి బులియన్ మార్కెట్‌ను ఒక్కసారిగా షేక్ చేశాయి.

సోమవారం రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ కాస్ట్ 10 గ్రాములకు రూ.1లక్ష57వేల290 వద్ద ముగిసింది. అయితే గత ట్రేడింగ్ సెషన్‌లో ఇదే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ.1లక్ష60వేల800 వద్ద కొనసాగడం గమనార్హం. అంటే ఒక్కరోజే ఏకంగా రూ.3,510 వరకూ భారీగా తగ్గి పుత్తడి ప్రియులకు ఊరటనిచ్చింది. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు వంటి మెయిన్ సిటీల్లోనూ సుమారు ఇదే ధరలు తగ్గి అందరికీ తీపి కబురు అందించాయి.

మరోవైపు జ్యువెలరీ తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా బాగానే తగ్గింది. సోమవారం రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1లక్ష,41వేల890 వద్ద రికార్డైంది. ఇక గ్లోబల్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పాట్ మార్కెట్‌లో గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 4,403 డాలర్ల దగ్గర ట్రేడింగ్ అవుతోంది.

Gold Price

పసిడితో పోటీ పడుతూ సిల్వర్ ధరలు కూడా బాగా దిగి వచ్చాయి. సోమవారం కేజీ వెండి ధర రూ.2లక్షల38వేల571 వద్ద నమోదైంది. గ్లోబల్ మార్కెట్‌లో చూసుకుంటే ఔన్సు సిల్వర్ కాస్ట్ ఇప్పుడు సుమారు 65 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

రోజురోజుకూ పెరుగుతున్న ధరల మధ్య ఇలాంటి భారీ తగ్గింపు నిజంగా గోల్డ్ అండ్ సిల్వర్ లవర్స్‌కు పండగలాంటి వార్తే అని చెప్పొచ్చు. రానురాను ఈ గ్లోబల్ మార్కెట్ తుపాను ఎటువంటి మలుపులు తిరుగుతుందో, రేట్లు ఇంకా తగ్గి మైండ్ బ్లాక్ చేస్తాయో లేదంటే మరింత పెరిగి ఆకాశాన్ని తాకుతాయో చూడాలి మరి.

Bigg Boss 10 : అట్టహాసంగా బిగ్ బాస్ 10 హంగామా.. దెయ్యం డ్రామాలు, కన్నీళ్ల కష్టాలు, లవ్ కబుర్లు..

Exit mobile version