Gold Price
దీపావళికి బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి బులియన్ మార్కెట్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవల కొద్ది కొద్దిగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల(Gold Price)కు వీక్ స్టార్టింగ్‌లోనే అకస్మాత్తుగా బ్రేకులు పడ్డాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభం కాగానే ధరలు ఒక్కసారిగా మళ్లీ పుంజుకోవడంతో గోల్డ్ లవర్స్‌లో టెన్షన్ స్టార్టయింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ త్వరలో చేపట్టనున్న వడ్డీ రేట్ల సమీక్షతో పాటు గ్లోబల్ ఆర్థిక పరిణామాలే ఈ అనూహ్య మార్పులకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు వివరిస్తున్నాయి.
దేశీయంగా అక్టోబర్ 26వ తేదీ సోమవారం ధరలను గమనిస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర(Gold Price) రూ.170 పెరిగి రూ.1లక్ష42వేల750 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.150 పెరిగి రూ.1లక్ష30వేల850 మార్కుకు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతుండగా, ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1లక్ష42వేల900గా, 22 క్యారెట్లు రూ.1లక్ష31వేలు దగ్గర కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ధరలే చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ కూడా నమోదయ్యాయి.
మరోవైపు బంగారంతో పోలిస్తే వెండి లవర్స్‌కు కాస్త రిలీఫ్ లభించింది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సిటీల్లో ప్రస్తుతం కేజీ సిల్వర్ కాస్ట్ రూ.2.20 లక్షల వద్ద ట్రేడవుతోంది. నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ మార్కెట్ సమావేశాల సంకేతాల వల్ల.. రాబోయే రోజుల్లో పసిడి, వెండి ధరలు మరిన్ని ఒడిదొడుకులకు గురయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
