Gold Rates:సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. ఐదో రోజు కూడా పెరిగిన రేట్లు

Gold Rates అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ విలువలో వస్తున్న మార్పుల ప్రభావం డైరెక్టుగా బంగారం ధరల(Gold Rates)పై పడుతోంది.

Gold Rates

బంగారం ప్రియులకు వరుసగా ఐదో రోజు కూడా చేదు వార్త అందింది. ఈ వారం ప్రారంభం నుంచి మొదలైన ధరల పెరుగుదల శుక్రవారానికి కూడా అదుపులోకి రాకపోవడంతో సామాన్యులు బంగారం కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ విలువలో వస్తున్న మార్పుల ప్రభావం డైరెక్టుగా బంగారం ధరల(Gold Rates)పై పడుతోంది. కొద్ది రోజులుగా కొంత ఊరటనిస్తూ వచ్చిన ధరలు, వారం రోజులుగా కొనుగోలుదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ , విశాఖపట్నంలో ఈరోజు పసిడి ధరలు సుమారు ఒకే విధంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర గురువారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగి 1,55,580 రూపాయల వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా జ్యువెలరీ తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి ధర కూడా స్వల్ప పెరుగుదలతో 1,42,610 రూపాయలకు చేరుకుంది. ఐటీ హబ్ బెంగళూరులో కూడా ఇవే బంగారం ధరలు(Gold Rates) కొనసాగుతున్నాయి.

Gold Prices

దేశంలోని ఇతర మెట్రో సిటీలను గమనిస్తే, చెన్నైలో ధరలు మాత్రం మిగిలిన ప్రాంతాల కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల పసిడి 1,56,670 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర 1,43,610 రూపాయలుగా నమోదైంది. ఢిల్లీలో కూడా ధరల జోరు తగ్గలేదు. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 1,55,730 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర 1,42,760 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇలా దేశవ్యాప్తంగా పసిడి తన పరుగును నిరాటంకంగా కొనసాగిస్తోంది.

మరోవైపు వెండి ధరలను పరిశీలిస్తే, అక్కడ కూడా తగ్గుదల ఏమీ కనిపించడం లేదు. హైదరాబాద్ , చెన్నై నగరాల్లో కిలో వెండి ధర 2,74,900 రూపాయల వద్ద స్థిరంగా దీని ధర కొనసాగుతోంది. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర 2,69,900 రూపాయలుగా ఉంది. గురువారంతో పోలిస్తే వెండి ధరల్లో స్వల్ప మార్పులు తప్ప కొనేవారికి పెద్దగా ఊరట లభించలేదు. పెళ్లిళ్ల సీజన్ వల్ల డిమాండ్ పెరగడం, అంతర్జాతీయంగా సరఫరా ఇబ్బందులు వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిలోనే ఉండటానికి కారణమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

KKR vs GT: కోల్ కథ మారేనా ?…గుజరాత్ తో కీలక మ్యాచ్

Exit mobile version