New rules: జూన్ 1 నుంచి కొత్త రూల్స్..ఎల్‌పీజీ సిలిండర్, క్రెడిట్ కార్డ్‌ల గురించి ఆ 3 మార్పులు తెలుసుకోండి

New rules:జూన్ ఒకటో తేదీ నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు, క్రెడిట్ కార్డ్‌ను వాడేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి.

New rules

జూన్ నెల వచ్చేస్తుంది.. ప్రతి నెల ఫస్ట్ తారీఖున దేశవ్యాప్తంగా కొన్ని ఆర్థికపరమైన మార్పులు జరుగుతూ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే జూన్ ఒకటో తేదీ నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు, క్రెడిట్ కార్డ్‌ను వాడేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్(New rules) అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పుల గురించి ముందే తెలుసుకోవడం వల్ల చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా మన ఫైనాన్షియల్ ప్లాన్‌ను సరిగ్గా సెట్ చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల విషయానికి వస్తే, ప్రతి నెల ఒకటో తారీఖున పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీలు.. అంతర్జాతీయ మార్కెట్ ధరలు , ముడి చమురు రేట్లను బట్టి గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. గృహ అవసరాలకు వాడే పద్నాలుగు కేజీల సిలిండర్ ధరలతో పాటు, వ్యాపారాల కోసం ఉపయోగించే పందొమ్మిది కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది.

కొన్ని నెలలుగా కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈసారి కూడా సామాన్యులకు , హోటల్ వ్యాపారులకు ఊరట లభిస్తుందా లేదా అనేది శనివారం నాటి మార్కెట్ రేట్లను బట్టి తేలుతుంది. ఈ ధరల మార్పు అనేది దేశంలోని వేర్వేరు సిటీలను బట్టి కొద్దిగా మారుతూ ఉంటుంది.

మరోవైపు క్రెడిట్ కార్డ్ వాడుతున్న వారికి కూడా జూన్ నెల నుంచి కొత్త కండిషన్లు(New rules) రాబోతున్నాయి. దేశంలోని ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ పాలసీలను సవరిస్తున్నాయి. దీనిలో భాగంగా క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే కొన్ని రకాల లావాదేవీలపై లభించే రివార్డ్ పాయింట్లను తగ్గించడం లేదా పూర్తిగా నిలిపివేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నాయి.

New rules

ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రెంట్ పేమెంట్స్ చేయడం, ప్రభుత్వ సర్వీసులకు బిల్లులు పేమెంట్ చేయడం, యుటిలిటీ బిల్స్ , ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టేటప్పుడు ఇకపై ఎలాంటి రివార్డ్ పాయింట్లు రాకపోవచ్చు. అంతేకాకుండా కొన్ని బ్యాంకులు ఫ్రీ లాంజ్ యాక్సెస్ కండిషన్లను మరింత కఠినతరం చేయడంతో పాటు, లేట్ పేమెంట్ ఫీజులను కూడా పెంచే ఆలోచనలో ఉన్నాయి. అందుకే క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ బ్యాంక్ నుంచి వచ్చే అప్‌డేట్ మెసేజ్‌లను ఒకసారి జాగ్రత్తగా గమనించి ఖర్చులు పెట్టుకోవడం మంచిది.

ముఖ్యంగా, ఆధార్ కార్డులో వివరాలను ఫ్రీగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవడానికి యూఐడీఏఐ కల్పించిన లాస్ట్ డేట్ జూన్ 14తో ముగుస్తుంది. ఆ తర్వాత అడ్రస్ వంటి వివరాలను మార్చుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మ్యూచువల్ ఫండ్ల ట్రాన్జాక్షన్లను స్పీడప్ చేయడానికి తెచ్చిన కొత్త రూల్స్ (New rules) కూడా జూన్ నుంచే అమల్లోకి రాబోతున్నాయి.

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ సంపాదన ఎంత? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈ రేంజ్‌కు రావడానికి కారణం ఏంటి?

Exit mobile version