Aadhaar Card
టూర్‌కు వెళ్లినప్పుడు లేదంటే ఆఫీస్ వర్క్ మీద వేరే ఊరు వెళ్లినప్పుడు హోటల్స్‌లో స్టే చేయడం అందరికీ అలవాటే. అయితే హోటల్‌లో చెక్-ఇన్ అయ్యేటప్పుడు మన ఐడెంటిటీ ప్రూఫ్ కోసం రిసెప్షన్‌లో ఆధార్ కార్డు(Aadhaar Card) జిరాక్స్ కాపీ ఇవ్వడం ఇన్నాళ్లూ ఒక కామన్ ప్రాసెస్‌గా జరిగేది.
కానీ ఆ ఒక్క ఆధార్ కార్డ్(Aadhaar Card) జెరాక్స్ కాపీ వల్ల పర్సనల్ డీటైల్స్ మిస్ యూజ్ అయిన సంఘటనలు కూడా జరిగాయి. దీంతో ఏ క్షణంలోనైనా అవి తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి సైబర్ నేరగాళ్ల బారిన పడతాయేమో అన్న అనుమానం పీకుతూ ఉండేది.
అంతేకాదు ప్రతిసారీ జెరాక్స్ ప్రాసెస్ కోసం రిసెప్షన్ ముందు వెయిట్ చేయడం విసుగు పుట్టించేది. ఈ సమస్యలన్నింటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపుతూ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (UIDAI) మంచి డిజిటల్ సొల్యూషన్‌ను అందరి ముందుకు తీసుకొచ్చింది.
యుఐడీఏఐ(UIDAI) తీసుకువచ్చిన ఈ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం ఇకపై హోటళ్లలో చెక్ ఇన్ అవ్వడానికి ఎలాంటి ఫిజికల్ జిరాక్స్ కాపీలు వెంట తీసుకుని వెళ్లాల్సిన పనిలేదు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆఫిషియల్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ సహాయంతో కేవలం కొద్ది సెకన్లలోనే మీ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిపోతుంది.
ఇది డిజిటల్ ఇండియా పద్ధతులను మరింత స్పీడప్ చేయడమే కాకుండా చాలామందికి అనవసరమైన పేపర్ వర్క్ నుంచి పూర్తి ఊరటనిస్తుంది. ఎంత అర్జంటు పని ఉన్నా కూడా తప్పనిసరిగా రిసెప్షన్ దగ్గర లైన్లలో నిలబడే పని లేకుండా..ఇకపై ప్రాసెస్ చాలా స్మూత్‌గా సాగిపోతుంది.
మన పర్సనల్ డేటా సేఫ్టీ అండ్ సెక్యూరిటీనే ఈ కొత్త విధానం వెనుక ఉన్న అసలైన హైలైట్. గతంలో మనం ఇచ్చే జెరాక్స్ కాపీలు దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ ఈ కొత్త డిజిటల్ వెరిఫికేషన్ వల్ల మన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ప్రోటెక్టెడ్‌గా ఉంటుంది.
అన్నింటికంటే మెయిన్‌గా, ఈ యాప్ ద్వారా మనం ఎదుటివారికి ఏ డీటైల్స్ అయితే చూపించాలని అనుకుంటున్నామో అంటే ఉదాహరణకు కేవలం పేరు, ఫోటో లేదా అడ్రస్ వంటివి అంతవరకు మాత్రమే సెలెక్టివ్‌గా షేర్ చేసుకునే కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. అనవసరమైన ఇన్ఫర్మేషన్ వారి సిస్టమ్‌లోకి వెళ్లకుండా మన డేటా ప్రైవసీని మనమే కంట్రోల్ చేసుకోవచ్చు.
ఇంతకీ యుఐడీఏఐ(UIDAI) ఏంటి? అందరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా అనే డౌట్ చాలామందికి వస్తుంది. యుఐడీఏఐ అనేది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే గుర్తింపు నిర్వహణ సంస్థ. ఈ డిజిటల్ యాప్ అనేది ప్రయాణాలు చేసే వారికే కాకుండా, ప్రతి పౌరుడికి తన ఐడెంటిటీని సురక్షితంగా ఉంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకుని ఉంచుకుంటే.. హోటల్ చెక్-ఇన్‌ల దగ్గర నుంచి ఇతర అఫీషియల్ సర్వీసులకు పేపర్ కాపీల గోల లేకుండా చాలా సింపుల్‌గా, సేఫ్‌గా పనులు పూర్తి చేసుకోవచ్చు.
Intuition : నోటి మాట ఫలించడం వెనుక పవర్స్ ఉంటాయా?సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఏం చెబుతున్నాయ్..
