Zen Ji girls
ఒకప్పుడు అమ్మాయికి 23 లేదా 25 ఏళ్లు వచ్చాయంటే చాలు.. సెటిల్ అయిపోవాలి, పెళ్లి చేసుకోవాలి, ముప్పై ఏళ్లు వచ్చేటప్పటికి ఒక సొంతిల్లు కొనుక్కోవాలనే ట్రెడిషనల్ రూల్స్ ఉండేవి. కానీ ఇప్పటి జెన్-జీ (Gen-Z) అబ్బాయిల కంటే కూడా ఎక్కవగా జెన్ జీ అమ్మాయిలు(Zen Ji girls) ఈ పాతకాలపు రూల్ బుక్స్‌ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు.
పెళ్లి, పిల్లలు, ఇల్లు కొనడం వంటి లైఫ్ చేంజింగ్ డెసిషన్స్‌ను చాలా స్మూత్‌గా హోల్డ్‌లో పెట్టేస్తున్నారు. ఇటీవల ఫేమస్ గ్లోబల్ సంస్థ డెలాయిట్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ సర్వేలో సుమారు 55 శాతం మంది జెన్-జీ అమ్మాయిలు తమ కీలకమైన లైఫ్ డెసిషన్స్‌ను వాయిదా వేస్తున్నట్లు స్పష్టమైంది.
దీని వెనుక మెయిన్‌గా వినిపిస్తున్న మాట.. మనీ అండ్ మెంటల్ పీస్. ఇప్పటి నేటి మెట్రో సిటీలలో హౌస్ రెంట్స్, ఈఎమ్ఐలు, డైలీ మెయింటెనెన్స్ ఖర్చులు చూస్తుంటే ఎలాంటివారికి అయినా మెంటల్ ఎక్కుతుంది. దీంతో ఏదో ఒక జాబ్ చేసి సెటిలయిపోవడం కాకుండా, ఫ్యూచర్ అవసరాలకి సరిపడా ఎక్కువ శాలరీ ఇచ్చే జాబ్స్‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
ఇంకోవైపు రియల్ ఎస్టేట్ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకడంతో సొంతింటి కల అనేది ఇమ్మీడియట్ నీడ్ కాదని డిసైడ్ అయ్యారు. ఫైనాన్షియల్‌గా కంప్లీట్ స్టాండ్‌లోకి రాకుండా మ్యారేజ్ చేసుకుంటే ఆ ప్రెజర్ వల్ల జీవితంలో ప్రశాంతత ఉండదనేది వీరి ఆలోచన అని మానసిక నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా నేటి అమ్మాయిలలో ఓన్లీ జాబ్ కాకుండా స్మార్ట్ స్టార్టప్స్ మొదలుపెట్టాలనే కోరిక చాలా విపరీతంగా పెరుగుతోంది. బిజినెస్ నిలదొక్కుకోవడానికి కనీసం 5 నుంచి 8 సంవత్సరాల టైమ్ పడుతుంది. ఇలాంటి సమయంలో పెళ్లి, పిల్లలు అని గ్యాప్ తీసుకుంటే కెరీర్ గ్రాఫ్ దెబ్బతింటుందనే క్లారిటీ వాళ్లకు ఫుల్‌గా ఉంది.
అంతేకాదు పార్ట్నర్ సెలక్షన్ విషయంలో కూడా పాత ఆలోచనలు లేవు. తమ ఆలోచనలను, ఆశయాలను గౌరవించడమే కాకుండా.. ఇంటి పనులను కూడా ఈక్వెల్‌గా షేర్ చేసుకునే లైఫ్పార్ట్నర్ దొరికినప్పుడే ముందడుగు వేస్తామని చాలామంది అమ్మాయిలు చెబుతున్నారు. సొసైటీ ఏమనుకుంటుందో అని తొందరపడి బాధ్యతలను నెత్తిన వేసుకోవడం కంటే కూడా అన్ని విధాలా రెడీ అయ్యాకే.. లైఫ్‌లో నెక్స్ట్ స్టెప్ వేయడం మంచిదని ఈ డిజిటల్ జనరేషన్ భావిస్తోంది.
Spectacle Marks : కళ్లజోడు వల్ల ముక్కుపై మచ్చలు వచ్చాయా?.. ఈ సింపుల్ రెమెడీస్ ఫాలో అవ్వండి..
