December New Rules
డిసెంబర్ ప్రారంభం నుంచే సామాన్యుల బడ్జెట్‌పై ఎఫెక్ట్ చూపించే కొన్ని కీలక మార్పులు(December New Rules) అమల్లోకి రానున్నాయి. డిసెంబర్ 1 వ తేదీ నుంచి క్రెడిట్ కార్డ్ చార్జీలు, గ్యాస్ సిలిండర్ రేట్లు, అలాగే బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన నిబంధనలలో మార్పులు కనిపించే అవకాశం ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ వాడేవారికి కొన్ని ఖర్చులపై ఎక్స్‌ట్రా బాదుడు తప్పకపోవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం, ఒకే ట్రాన్జాక్షన్‌లో ట్రాన్స్‌పోర్ట్ మీద రూ. 30,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే 1 శాతం సర్‌ఛార్జ్ పడుతుంది. అలాగే ఒక బిల్లింగ్ సైకిల్‌లో ఇంధనం మీద మొత్తం ఖర్చు రూ. 50,000 దాటితే 1 శాతం సర్‌ఛార్జ్ వసూలు చేస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, లిమిట్ దాటిన అమౌంట్‌పై కాకుండా టోటల్ ఫ్యూయల్ బిల్లుపై ఈ ఛార్జీ వర్తిస్తుంది.
మరోవైపు డిసెంబర్ 2 వ తేదీ నుంచి 4 వ తేదీ వరకు జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్‌లో రెపో రేటుపై కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ మీటింగ్‌లో ఆర్బీఐ రెపో రేటును 0.25 శాతం పెంచి 5.50 శాతానికి చేర్చింది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం హోమ్ లోన్స్‌తో పాటు ఫ్లోటింగ్ రేటు లోన్ల ఈఎంఐలపై, అలాగే డిపాజిట్లపైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది.
రెపో రేటు పెరిగితే బ్యాంకులు లోన్లపై వడ్డీ పెంచే అవకాశం ఉంటుంది. దాంతో ఈఎంఐ పెరగడం లేదంటే టెన్యూర్ పెరగడం వంటివి జరగొచ్చు. అదే టైమ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొంత మెరుగైన ఇంట్రస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక గ్యాస్ సిలిండర్ల విషయం చూస్తే.. ప్రతినెలా ఒకటో తేదీన చమురు కంపెనీలు ఎల్పీజీ రేట్లను సవరిస్తాయి. డిసెంబర్ 1వ తేదీన 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలో మార్పులు హోటళ్లు, వ్యాపారాలపైన ఎఫెక్ట్ చూపిస్తాయి. అయితే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుందా, అలాగే ఉంటుందా అనేది సామాన్యుల ఇంటి బడ్జెట్‌కు చాలా కీలకం. మొత్తానికి డిసెంబర్ నెల స్టార్టింగ్ నుంచే ఆర్థిక పరమైన అంశాల్లో ఈ మార్పులపై చర్చ సాగుతోంది.
