Gold Prices
గోల్డ్ కొనాలని భావిస్తున్న పసిడి ప్రియులకు షాక్ తగిలింది. కొద్ది రోజులుగా సామాన్యులకు కాస్త ఊరటనిస్తూ తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు ఒక్కసారిగా తమ రూటు మార్చాయి. బుధవారం కాస్త ధర తగ్గినట్లు కనిపించినా, గురు, శుక్రవారాల్లో మాత్రం బంగారం రేట్లు మరోసారి విరుచుకుపడ్డాయి. రెండు రోజుల్లోనే పుత్తడి ధర అమాంతం పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
తాజాగా నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్‌పై ఏకంగా రూ. 1,750 పెరగ్గా, 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారంపై రూ. 1,600 వరకూ కాస్ట్ పెరిగింది. ఈ రేట్ల ప్రభావం గ్లోబల్ మార్కెట్‌లో కూడా క్లియర్‌గా కనిపిస్తోంది. అక్కడ ఔన్సు గోల్డ్ ధర ఏకంగా 65 డాలర్లు పెరిగి ఇప్పుడు 3,631 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్‌తో పాటు సిల్వర్ కూడా అదే బాటలో పయనిస్తూ కిలోపై ఏకంగా రూ. 5,000 పెరిగి కొనుగోలుదారులకు గట్టి షాకే ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్,వరంగల్,రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నంలో జిఎస్టీ, మేకింగ్ ఛార్జీలు కాకుండా 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1లక్ష26వేల550 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1లక్ష16వేల మార్కును తాకింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ. 1లక్ష26వేల600 కాగా, 22 క్యారెట్ల రేటు రూ. 1లక్ష16వేల150గా నమోదైంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలోనూ 24 క్యారెట్లు రూ. 1లక్ష26వేల550, 22 క్యారెట్లు రూ. 1లక్ష16వేల వద్ద మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్నాయి.
ఇక వెండి ధర విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా సుమారు అన్ని ప్రధాన నగరాల్లో ఒకే రేటు కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1లక్ష60వేల వద్ద స్థిరపడింది.
అయితే ఈ రేట్లు కేవలం ఉదయం మార్కెట్ ప్రారంభంలో నమోదైన వివరాలు మాత్రమే కాగా, రోజులో మార్కెట్ పరిణామాలను బట్టి పసిడి, వెండి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుందనే విషయాన్ని కొనుగోలుదారులు గుర్తించాలి.
Weight Loss : వెయిట్ లాస్ కోసం పండ్లు తింటున్నారా?.. బరువు పెరుగుతారేమో చూసుకోండి..
