YouTuber Nandana : లండన్ జాబ్స్ పేరుతో బిగ్ స్కామ్.. ఫేమస్ యూట్యూబర్ నందన అరెస్ట్..

YouTuber Nandana : యూట్యూబర్ నందన, ఆమె భర్త కలిసి .. యూకేలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి, వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఫండ్స్ వసూలు చేశారంటూ చాలా ఆరోపణలు వెల్లువెత్తాయి.

YouTuber Nandana

సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారని నమ్మించి..వారి విదేశీ కలలతో ఆటలాడితే చివరికి కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని నిరూపించింది యూట్యూబర్ నందన ఇన్సిడెంట్. లండన్ పంపిస్తాం, మంచి ఉద్యోగాలిప్పిస్తామంటూ అమాయకుల నుంచి లక్షల్లో వసూలు చేసి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో.. ఇమ్మిగ్రేషన్ అధికారుల అలర్ట్‌తో పోలీసులు నందనను అదుపులోకి తీసుకున్నారు.

యూట్యూబర్ నందన, ఆమె భర్త కలిసి .. యూకేలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి, వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఫండ్స్ వసూలు చేశారంటూ చాలా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ భార్యాభర్తల మాటలు నమ్మి మోసపోయామంటూ బాధితులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై విచారించి.. ఈ క్రిమినల్ వ్యవహారంలో నందన ఇండియా దాటి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

YouTuber Nandana

అయితే సోమవారం ఎవరికీ అనుమానం రాకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన నందనను అక్కడున్న ఇమ్మిగ్రేషన్ సిబ్బంది పసిగట్టారు. రెడ్ ఫ్లాగ్ పడటంతో వెంటనే అలర్టయిన అధికారులు.. ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు. రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.

ఆమెను కస్టడీలోకి తీసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు.. ఈ నెట్‌వర్క్ వెనుకున్న దందా, భర్తతో కలిసి వసూలు చేసిన అమౌంట్ ఎంత అనే దానిపైన విచారణ జరుపుతున్నారు. మరి ఈ జాబ్ స్కామ్ కేసు ముందు ముందు ఎలాంటి టర్నింగ్‌లు తీసుకుంటుందో చూడాలి.

Kulfi : ఫారిన్ ఫ్రోజన్ డెజర్ట్స్‌ వేస్ట్..ఐస్‌క్రీమ్‌ల బాస్‌ ఇండియన్ కుల్ఫీనే..

Exit mobile version