Kulfi : ఫారిన్ ఫ్రోజన్ డెజర్ట్స్ వేస్ట్..ఐస్‌క్రీమ్‌ల బాస్ ఇండియన్ కుల్ఫీనే..
Kulfi : మనం తినే వెస్ట్రన్ ఐస్‌క్రీమ్‌లలో ఎయిర్‌ను మిక్స్ చేసి సాఫ్ట్ అండ్ ప్లఫీ టెక్స్చర్ను తీసుకువస్తారు. కానీ మన కుల్ఫీ స్టైలే వేరు.
Kulfi
ఒకప్పుడు ఎండాకాలంలోనే చల్లటి ఐస్‌క్రీమ్‌లు, జ్యూస్‌లు, ఫలూదాలకు ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకపోయినా తెగ హాట్ ఫేవరేట్ అయిపోయింది. అయితే ఇప్పటి వరకూ భారత దేశంలోని గల్లీల్లో అమ్ముకునే సాధారణ కుల్ఫీ ఐస్‌క్రీమ్‌కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎల్బీడబ్ల్యూ రేంజ్ క్రేజ్ వచ్చేసింది.
వరల్డ్ వైడ్‌గా వివిధ కంట్రీల ట్రెడిషనల్ రెసిపీలకు మార్కులు వేసే గ్లోబల్ ఫుడ్ గైడ్ ..టేస్ట్ అట్లాస్ 2026కి గానూ వరల్డ్ బెస్ట్ ఫ్రోజన్ డెజర్ట్స్ లిస్ట్‌ని రిలీజ్ చేసింది. వరల్డ్‌లోని వందలాది ఐస్‌క్రీమ్‌లను తట్టుకుని భారత దేశపు ఐకానిక్ కుల్ఫీ ఏకంగా సెవన్త్ ప్లేస్‌ను కైవసం చేసుకుని గ్లోబల్ లెవెల్లో ఇండియా జెండాను గాల్లో రెపరెపలాడించింది.
సాధారణంగా మనం తినే వెస్ట్రన్ ఐస్‌క్రీమ్‌లలో ఎయిర్‌ను మిక్స్ చేసి సాఫ్ట్ అండ్ ప్లఫీ టెక్స్చర్ను తీసుకువస్తారు. కానీ మన కుల్ఫీ స్టైలే వేరు. ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్‌ను స్టవ్‌పై పెట్టి గంటల తరబడి మెల్లగా మరిగిస్తారు. మిల్స్ సగం కంటే తక్కువగా అయ్యే వరకు బోయిల్ చేయడం వల్ల వాటికి ఒక క్రేజీ క్యారమెలైజ్డ్, నట్టి ఫ్లేవర్ వస్తుంది.
అందుకే కుల్ఫీని తింటుంటే చాలా హెవీగా, సూపర్ క్రీమీగా అనిపిస్తుంది. దీనికి పిస్తా, బాదం, యాలకులు, కుంకుమపువ్వు, రోజ్ వాటర్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్లేవర్స్‌ని మిక్స్ చేసి స్పెషల్ కోన్ షేప్ అచ్చుల్లో గడ్డ కట్టిస్తారు. ఈ మేకింగ్ ప్రాసెస్ వల్లే కుల్ఫీ ప్రపంచంలోనే ప్రత్యేకమైన డెజర్ట్‌గా మారేలా చేసింది.
నిజానికి కుల్ఫీకి ఇదంతా ఇప్పుడే వచ్చిన క్రేజ్ కాదు. దీని శతాబ్దాల చరిత్ర ఉందన్న విషయం చాలామందికి తెలీదు. మొఘలుల రాజభవనాల నుంచి స్టార్ట్ అయిన ఈ రాయల్ డెజర్ట్ జర్నీ, ఈరోజు స్ట్రీట్స్‌లో దొరికే కుల్ఫీ బండి వరకు కొనసాగడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.
ఒక్క కుల్ఫీ మాత్రమే కాదు, కుల్ఫీతో కాంబినేషన్‌గా వచ్చే కుల్ఫీ ఫలూదా కూడా వరల్డ్ వైడ్‌గా సూపర్ పాపులర్ అయ్యింది. కుల్ఫీ పీసెస్కు ఫలూదా సేవయాలు, రోజ్ సిరప్, సబ్జా గింజలు, డ్రైఫ్రూట్స్ యాడ్ చేసి ఇచ్చే ఈ కాంబోకు గ్లోబల్ ఫుడ్ లవర్స్ ఫిదా అయిపోతున్నారు.

2026 టేస్ట్ అట్లాస్ లిస్ట్‌లో ..ఇంగ్లాండ్ దేశానికి చెందిన క్లాటెడ్ క్రీమ్ ఐస్‌క్రీమ్ మొదటి స్థానానికి ఫిక్స్ అయిపోగా.. ఇటలీ జెలాటో అల్ పిస్తాచియో సెకండ్, టర్కీ డోండూర్మా థర్డ్, అమెరికా ఫ్రోజెన్ కస్టర్డ్ ఫోర్త్, పెరూ క్రిమోలాడా ఫిఫ్త్ ప్లేస్‌లలో నిలిచాయి.
మొత్తంగా మన కుల్ఫీ టాప్ 7లో నిలవడం ఇండియన్ ఫుడ్ కల్చర్‌కు దక్కిన గొప్ప గౌరవమనే చెప్పాలి. చిన్నప్పుడు వీధుల్లో బండి దగ్గర కొనుక్కుని తిన్న కుల్ఫీ ఈరోజు అంతర్జాతీయ వేదికపై మెరవడం మనందరికీ గర్వకారణమవుతోంది.





