Allu Arjun
స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun )ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. తన అనుమతి లేకుండా తన నేమ్, వాయిస్, ఫోటోలు, వీడియోలను యాడ్స్, ప్రమోషన్ల కోసం వాడుకోకుండా చూడాలంటూ.. తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పరిరక్షణ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి తన ఇమేజ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని అల్లు అర్జున్ ఆందోళన వ్యక్తం చేశారు.
అల్లు అర్జున్(Allu Arjun )తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ స్వాతి సుకుమార్ ..ఢిల్లీ హై కోర్టుకు సంచలన విషయాలను వివరించారు. బన్నీ పేరుతో కొన్ని నకిలీ యాప్స్ (Fake Apps) క్రియేట్ చేయడమే కాకుండా, సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీతో బన్నీ గొంతును, రూపాన్ని అనుకరిస్తూ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు.
అంతే కాదు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. అల్లు అర్జున్(Allu Arjun) ఫోటో కనిపించేలా గుర్తు తెలియని వ్యక్తులు ఇతరులకు వీడియో కాల్స్ చేస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది కేవలం ఒక యాక్టర్ పర్సనల్ స్టేటస్‌కే కాకుండా, సాధారణ ప్రజల భద్రతకు కూడా ముప్పుగా పరిణమిస్తోందని బన్నీ న్యాయవాది వాదించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ తుషార్ రావు గెడెల, అర్జున్‌కి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు.
దీంతో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులను కాపాడటంలో మన కోర్టులు ఎప్పుడూ ముందుంటాయన్న విషయం మరోసారి ప్రూవ్ అయింది. అల్లు అర్జున్ కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ పర్మిషన్ లేకుండా తమ ఇమేజ్‌ను యాడ్స్‌లో వాడటంపై గతంలో కోర్టును ఆశ్రయించి సానుకూల ఉత్తర్వులు పొందారు. అలాగే బాలీవుడ్ నుంచి ఐశ్వర్యారాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్ కూడా తమ ప్రచార హక్కుల కోసం న్యాయపోరాటం చేయగా వారికి ధర్మాసనం అండగా నిలిచింది.
నిజానికి వాణిజ్య సంస్థలతో పాటు కొంతమంది సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీల ఇమేజ్‌ను వాడుకోవడానికి వారికున్న బ్రాండ్ వాల్యూ మెయిన్ రీజన్ అవుతోంది. ఒక ప్రముఖ హీరో ఫోటోను చూపిస్తే ప్రజలు ఆ యాప్‌ను , వెబ్‌సైట్‌ను ఈజీగా నమ్ముతారు. దీని ద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకోవచ్చనేది వారి ప్లాన్.
ఇక బ్రాండ్ అంబాసిడర్లుగా సెలబ్రిటీలను ఒప్పించడానికి కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. అది తప్పించుకోవడానికి ఇలా దొంగచాటుగా ఏఐ ద్వారా ఫోటోలను వాడుకుంటున్నారు.
అలాగే సెలబ్రెటీల పేరుతో ఫేక్ వీడియో కాల్స్ చేసి.. సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు పర్సనల్ డేటాను సేకరించడం వంటి నేరాలకు పాల్పడతారు.
అందుకే టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో, దాన్ని అరికట్టే చట్టాలు కూడా అంతే బలంగా ఉండాలి. డీప్‌ఫేక్, ఏఐ కంటెంట్‌ను గుర్తించే సాఫ్ట్‌వేర్‌లను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు (FB, Insta, YouTube) తప్పనిసరిగా వాడాలి.అలాగే అభ్యంతరకర కంటెంట్‌ను వెంటనే తొలగించేలా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు తీసుకురావాలి.
Delimitation Bill : డీలిమిటేషన్ బిల్లు పాసవుతుందా ?…క్రాస్ ఓటింగ్ పైనే బీజేపీ ఆశలు
