Wedding
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారన్న వార్త తెలిసిందే. మార్చి 6న జరగనున్న పెళ్లి (Wedding)వేడుకకు ముందుగా, సినీ సెలబ్రెటీల కోసం ఏర్పాటు చేసిన ..ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక అట్టహాసంగా జరిగింది. సోమవారం రాత్రి అల్లు స్టూడియోస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు.
విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి(Wedding) తర్వాత టాలీవుడ్‌లో ఇప్పుడు ఆ రేంజ్‌లో ఇక్కడే సందడి కనిపిస్తోంది. కేవలం సినీ ఇండస్ట్రీలోని సెలబ్రెటీల కోసమే స్పెషల్‌గా నిర్వహించిన ఈ రిసెప్షన్ పార్టీలో.. అల్లు స్టూడియోస్ సరికొత్త కాంతులతో వెలిగి పోయింది. నూతన జంట శిరీష్ – నయనికలను ఆశీర్వదించడానికి వచ్చిన స్టార్లను చూడటానికి రెండు కళ్లు సరిపోలేదంటే అతిశయోక్తి కాదు.
ఈ వేడుకలో మెగా , అల్లు కుటుంబాల సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్- ఉపాసన, నాగబాబు కుటుంబం, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, సాయి దుర్గాతేజ్, వైష్ణవ్ తేజ్ అందరూ ఒకే చోట చేరి సందడి సందడి చేశారు.
అక్కినేని కుటుంబం నుంచి కింగ్ నాగార్జున, అమల, నాగచైతన్య హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో సందడి చేశారు. ఇక రానా దగ్గుపాటి, రవితేజ, గోపీచంద్, జగపతి బాబు వంటి టాప్ హీరోలు ఈ వేడుకలో మెరిశారు. డైరక్టర్ సుకుమార్, డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా, అట్లీతో పాటు బ్రహ్మానందం, అలీ వంటి సీనియర్ యాక్టర్లు కూడా ఈ వేడుకలో పార్టిసిపేట్ చేశారు.
మరోవైపు తమ్ముడి పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ స్పెషల్ లుక్‌తో మెరిసిపోయారు. అతిథులను సాదరంగా ఆహ్వానించడం దగ్గర నుంచి, ఏర్పాట్లన్నీ దగ్గరుండి మరీ అన్నీ తానై చూసుకున్నారు. అల్లు అర్జున్ -స్నేహారెడ్డి దంపతుల లుక్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ ఆదివారం జరిగిన మంగళస్నానం వేడుకలో.. విజయ్ దేవరకొండ – రష్మిక దంపతులు పాల్గొని సందడి చేయడం విశేషం.
ఇక అల్లు శిరీష్, నయనిక రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. గతేడాది వీరి ఎంగేజ్‌మెంట్ అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. 2013లో గౌరవం మూవీతో వెండితెరకు పరిచయమైన శిరీష్.. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షశివో వంటి మూవీలతో తనదైన నేమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు పర్సనల్ లైఫ్‌లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. మార్చి 6న జరగబోయే వీరి వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయులు మాత్రమే హాజరుకాబోతున్నారు.
