Aruguru Pativratalu : తెరపైకి మరోసారి ఆనాటి సంచలనం.. థియేటర్లలోకి ఈవీవీ కల్ట్ క్లాసిక్ ఆరుగురు పతివ్రతలు

Aruguru Pativratalu : 2004లో వచ్చిన ఆరుగురు పతివ్రతలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసి.. ఓ రేంజ్‌లో థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించింది.

Aruguru Pativratalu

టాలీవుడ్‌లో ఇప్పుడు రీ-రిలీజ్‌ల ట్రెండ్ బాగానే నడుస్తోంది. స్టార్ హీరోల నుంచి లవ్ స్టోరీల వరకు థియేటర్లలో రీ రిలీజ్ అవుతూ సరికొత్త హంగామా సృష్టిస్తున్నాయి. అలా ఒకప్పటి ట్రెండ్ సెట్టర్, కల్ట్ క్లాసిక్ మూవీ ఆరుగురు పతివ్రతలు మరోసారి ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది.

అప్పట్లో టాలీవుడ్‌ను యూత్ నుంచి ముసలివాళ్ల వరకూ అందరినీ ఓ ఊపు ఊపిన ఈ బోల్డ్ అండ్ ఎమోషనల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ..ఇప్పుడు రీ-రిలీజ్ కాబోతుండటంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అవుతోంది. నెటిజన్లు, మీమర్స్ బీభత్సమైన మీమ్స్‌తో నెట్టింట్లో రచ్చ లేపుతున్నారు.

హాస్య బ్రహ్మ, దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ మార్క్ చిత్రాలకు అప్పట్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేది. అలా ఆయన డైరెక్షన్‌లో, నిర్మాణంలో 2004లో వచ్చిన ఆరుగురు పతివ్రతలు(Aruguru Pativratalu) అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసి.. ఓ రేంజ్‌లో థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించింది.

కాస్త అడల్ట్ టచ్ ఉన్నా.. సొసైటీకి అవసరమైన ఒక బలమైన ఎమోషనల్ మెసేజ్‌ను ఈవీవీ ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించడం దీనికి బాగా ప్లస్ అయింది. ఈ మూవీలోని కొన్ని బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూనే ఉంటాయి. అంతేకాదు ఈ మూవీని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయాలంటూ నెటిజన్ల నుంచి బాగానే డిమాండ్ వినిపిస్తోంది.

కాగా జూన్ 30 న ఈవీవీ సత్యనారాయణ తనయుడు, హీరో అల్లరి నరేష్ పుట్టినరోజు నాడు ఈ మూవీ రీ-రిలీజ్‌ గురించి అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక క్రేజీ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అయితే, ఈ కల్ట్ బొమ్మ థియేటర్లలోకి వచ్చే డేట్‌ను మాత్రం మేకర్స్ ఇంకా రివీల్ చేయలేదు.

Aruguru Pativratalu

అయితే ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్ కాబోతోందనే న్యూస్ బయటకు రావడమే ఆలస్యం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఈ మూవీ ముచ్చట్లతోనే నిండిపోయాయి. మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రీ-రిలీజ్ ఇదే అంటూ నెటిజన్లు తెగ ఖుషీ అయిపోతున్నారు.

యూత్ నుంచి వస్తున్న ఈ క్రేజ్ చూస్తుంటే, రీ-రిలీజ్ రోజు థియేటర్ల వద్ద ఊరమాస్ రెస్పాన్స్ రావడం గ్యారంటీ అనిపిస్తోంది. కాగా సరికొత్త స్క్రీన్ క్వాలిటీ, సౌండ్ ఎఫెక్ట్స్‌తో రాబోతున్న ఈ ఈవీవీ మార్క్ సంచలనం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.

Headache : టెన్షన్ వల్ల హెడేక్ వస్తుందా? టెన్షన్ తగ్గినా తగ్గని తలనొప్పికి ఎలా చెక్ పెట్టాలి?

Exit mobile version