Ashu Reddy : మీడియాపై కోర్టుకెళ్లిన అషు రెడ్డి..తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Ashu Reddy : మన తెలుగులో ఒక సామెత ఉంటుంది... అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్విందని.. ప్రస్తుతం నటి అషు రెడ్డి తీరు ఇలానే ఉంది.

Ashu Reddy

మన తెలుగులో ఒక సామెత ఉంటుంది… అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్విందని.. ప్రస్తుతం నటి అషు రెడ్డి(Ashu Reddy) తీరు ఇలానే ఉంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9.5 కోట్ల వరకూ డబ్బులు తీసుకుందంటూ ఓ ఎన్నారై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దీనిని లీగల్ గానే ఎదుర్కొనేందుకు సిద్ధమైన అషు రెడ్డి మీడియాపై చిందులు తొక్కుతోంది.

తనపై నిరాధారమైన ఆరోపణలతో పెట్టిన కేసుకు సంబంధించి మీడియా ఇష్టానుసారం కథనాలు ప్రచురించడం, ప్రసారం చేస్తోందంటూ ఫైర్ అవుతోంది. అంతే కాదు మీడియాపై పరువు నష్టం దావా వేస్తానంటూ హడావుడి చేస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తనపై అవాస్తవ కథనాలు ప్రసారం చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

అషు రెడ్డి(Ashu Reddy)పై అమర్యాదకరమైన, అవాస్తవ కథనాలను ప్రసారం చేయకూడదని ఆదేశించింది. ఈ మేరకు మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అషు రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి పరువు నష్టం కలిగించే అంశాలను ప్రచురించకూడదని స్పష్టం చేసింది. ఉల్లంఘించే వారిపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే ఇప్పటికే అప్ లోడ్ చేసిన వివాదాస్పద కంటెంట్ తొలగించాలని ఆదేశించింది.

Ashu Reddy

ఇదిలా ఉంటే ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. బాధిత ఎన్నారైకి డబ్బులు ఇస్తానంటూనే అషు రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్టు చెబుతున్న ఆడియా లీక్ వైరల్ గా మారింది. ముందు కోటిన్నర ఇస్తాననీ, మిగిలిన మొత్తం తాను సెటిల్ అయ్యాక తిరిగిస్తానంటూ అషు రెడ్డి చెప్పడం, మంచిగా వినకుంటే వేరేలా ఉంటుందంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడడం కూడా కలకలం రేపింది.

కాగా తనపై ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిన మొత్తంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అషు రెడ్డి కోర్టులో తన వాదన వినిపించింది. ఇద్దరి మధ్య పెళ్లికి గానీ, ఈ లెక్కలకు గానీ సంబంధించిన రాతపూర్వక అగ్రిమెంట్స్ ఎలాంటివీ లేవని కోర్టుకు తెలియజేసింది. సదరు ఎన్నారై పూర్తిగా ఇష్టంతోనే ఈ ఖర్చు చేసాడనీ, తాను బలవంతం చేయలేదని పేర్కొంది. తన కుటుంబాన్ని పెళ్లికి ఒప్పించే క్రమంలోనే వారిని మచ్చిక చేసుకునేందుకే ఇదంతా ఖర్చు చేసినట్టు వాదన వినిపించింది. దీంతో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

Credit Card : క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. ఈరోజు నుంచి మారనున్న రూల్స్..

Exit mobile version