Just BusinessLatest News

Credit Card : క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. ఈరోజు నుంచి మారనున్న రూల్స్..

Credit Card : లేట్ పేమెంట్ ఛార్జీలు , వార్షిక రుసుము మినహాయింపు పరిమితుల్లో మార్పులు చేయడం వల్ల మధ్యతరగతి వినియోగదారులపై అదనపు భారం పడబోతోంది.

Credit Card

దేశంలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, తమ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. 2026 మే 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డ్ నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. సాధారణంగా ప్రతి నెలా ఒకటిన చమురు ధరలు, గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు వస్తుంటాయి.

కానీ ఈసారి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ (Credit Card)చార్జీల పెంపుపై వచ్చిన మార్పు.. వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టేలా ఉంది. ముఖ్యంగా లేట్ పేమెంట్ ఛార్జీలు , వార్షిక రుసుము మినహాయింపు పరిమితుల్లో మార్పులు చేయడం వల్ల మధ్యతరగతి వినియోగదారులపై అదనపు భారం పడబోతోంది.

తాజాగా లేట్ పేమెంట్ ఫీజు (Late Payment Charges) లిమిట్‌ను ఎస్బీఐ భారీగా సవరించింది. గతంలో రూ. 500 వరకు ఉన్న బకాయిలపై ఎటువంటి ఎక్స్‌ట్రా ఛార్జ్ ఉండేది కాదు. కానీ కొత్త రూల్స్ ప్రకారం, మీ బకాయి రూ. 100 దాటినా కూడా రూ. 100 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అంతేకాకుండా, రూ. 500 నుంచి రూ. 1,000 మధ్య ఉన్న బకాయిలపై ఇప్పటి వరకు ఉన్న రూ. 400 ఛార్జీని ఇప్పుడు రూ. 500కి పెంచింది. అంటే బిల్లు చెల్లించడం ఒక్క రోజు ఆలస్యమైనా, తక్కువ మొత్తం బకాయి ఉన్నా సరే భారీగా ఫైన్ కట్టక తప్పదు. ఇది వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ బిల్లులను గడువులోపు చెల్లించేలా ఒత్తిడి పెంచుతుంది.

Credit Card
Credit Card

మరోవైపు, ఎస్‌బీఐ బీపీసీఎల్ (SBI BPCL) కార్డ్ హోల్డర్లకు ఇయర్లీ ఛార్జ్‌ మినహాయింపు (Annual Fee Waiver) విషయంలో ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. గతంలో ఏడాదికి రూ. 50,000 ఖర్చు చేస్తే యాన్యువల్ ఛార్జ్ రూ. 499 రద్దయ్యేది. కానీ మే 1 నుంచి ఈ పరిమితిని ఏకంగా రూ. 1 లక్షకు పెంచారు. అంటే ఇప్పుడు మీరు ఏడాదికి రూ. 1 లక్ష కంటే తక్కువ ఖర్చు చేస్తే మాత్రం కచ్చితంగా యాన్యువల్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

ఖర్చులు పెరిగిన ఈ రోజుల్లో ఇలాంటి మార్పులు మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందికరంగా మారనున్నాయి. కేవలం ఎస్‌బీఐ మాత్రమే కాకుండా, ఇతర ప్రైవేట్ బ్యాంకులు కూడా తమ రివార్డ్ పాయింట్లతో పాటు లాంజ్ యాక్సెస్ నిబంధనలలో మార్పులు చేస్తున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ , యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై కూడా కొత్త ట్యాక్స్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. కాబట్టి క్రెడిట్ కార్డ్(Credit Card) వాడుతున్న వారు తమ ఖర్చుల విషయంలో , పేమెంట్ విషయంలో ఇప్పుడు మరింత అలర్ట్‌గా ఉండటం మంచిది.

Puja Room : వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఎక్కడ ఉండాలో తెలుసా?

Related Articles

Back to top button