Agniparishka 2
బిగ్ బాస్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. తెలుగు బుల్లితెరపై ఏళ్ల తరబడి సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో.. ఇప్పుడు సరికొత్తగా 10వ సీజన్‌తో ఇంకొద్ది రోజుల్లో మన ముందుకు రావడానికి రెడీ అయిపోయింది.
ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ తెలుగు బిగ్ బాస్ షోకి.. ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. తాజాగా కింగ్ అక్కినేని నాగార్జున అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయడంతో షోపై ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిపోయాయి.
అయితే ఈసారి సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే గోల్డెన్ ఛాన్స్ దొరికింది. సీజన్‌లో తీసుకొచ్చిన అగ్నిపరీక్ష కాన్సెప్ట్‌కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
దాంతో ఇప్పుడు అగ్నిపరీక్ష సీజన్-2(Agniparishka 2)ను ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఒక క్రేజీ ప్రోమోను కూడా రీసెంటుగా రిలీజ్ చేశారు. టాలెంట్ ఉండి, తమని తాము నిరూపించుకోవాలనుకునే వాళ్లకు ఇది ఒక బెస్ట్ ప్లాట్‌ఫామ్ కాబోతోంది.
ఈ అగ్నిపరీక్ష సీజన్-2(Agniparishka 2) ఆడిషన్స్‌లో పాల్గొనాలనుకునే వాళ్లు తమ ఆడిషన్ వీడియోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ వీడియో ఎలా ఉండాలి, దానిని ఎలా అప్లై చేయాలనే పూర్తి వివరాలను ప్రోమోలో క్లియర్‌గా వివరించారు.
అయితే జూన్ 12 నుంచి జూన్ 20 వరకు మాత్రమే బిగ్ బాస్ ఎంట్రీ కోసం ఆడిషన్స్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి బిగ్ బాస్ 10 హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తమ జీవితాన్ని మార్చుకోవాలి అనుకునే వాళ్లు జూన్ 20 వ తేదీ లోపే అప్లై చేసుకోవాలి. ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్‌లోకి ఎంటర్ అయి హంగామా చేసే ఆ లక్కీ పర్సన్స్ ఎవరో చూడాలి మరి.
Obesity : తల్లుల నుంచే కూతుర్లకు ఒబెసిటీ..జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ షాకింగ్ రిపోర్ట్
