Pensioners Alert : పెన్షన్‌దారులకు అలర్ట్.. లైఫ్ సర్టిఫికెట్‌కు డెడ్‌లైన్ దగ్గర పడుతోంది..

Pensioners Alert : నవంబర్ 30వ తేదీలోపు జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోతే పెన్షన్ ఆగిపోతుంది. బ్యాంకులు, ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగకుండా, ఫేస్ స్కాన్ అండ్ డోర్‌స్టెప్ సేవలతో క్షణాల్లో పని పూర్తి చేసుకునే డిజిటల్ సీక్రెట్ ప్రాసెస్ ..

Pensioners Alert

మంత్లీ మంత్లీ వచ్చే పెన్సన్ డబ్బులతోనే ఇల్లు గడిచే వృద్ధులకు, రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇంపార్టెంట్ మ్యాటర్ వినిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెన్షన్(Pensioners Alert) తీసుకుంటున్న వాళ్లు నవంబర్ 30వ తేదీలోపు తమ జీవన్ ప్రమాణ్ అంటే లైఫ్ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయకపోతే డిసెంబర్ నుంచి చేతికి ఒక్క రూపాయి కూడా రాదు. ఇంకా టైమ్ ఉందిలే అంటూ నెగ్లెక్ట్ చేస్తే లాస్ట్ మినిట్‌లో బ్యాంకుల దగ్గర లైన్లో నిలబడి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

కేంద్ర, రాష్ట్ర పెన్షన్ పొందుతున్న వ్యక్తి బతికే ఉన్నారా లేదా అని కన్ఫమ్ చేసుకోవడానికి ప్రభుత్వం ప్రతి ఏటా లైఫ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ నడిపిస్తుంది. అలా 80 ఏళ్లలోపు ఉన్న కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులకు, వారి ఫ్యామిలీకి నవంబర్ ఒకటవ తేదీ నుంచి ఈ విండో ఓపెన్ కాగా, 80 ఏళ్లు దాటిన పెద్దలకు అక్టోబర్‌లోనే ఛాన్స్ ఇచ్చారు. కానీ వీరిద్దరికీ లాస్ట్ డేట్ మాత్రం నవంబర్ 30వ తారీఖు.

దీనికోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ గంటల తరబడి నిలబడాల్సిన పని అస్సలు లేదు. చేతిలో మొబైల్ ఉంటే ఇంట్లో హాయిగా కూర్చునే ఈ పని పూర్తి చేయొచ్చు. ప్లేస్టోర్ నుంచి జీవన్ ప్రమాణ్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని.. జస్ట్ వారి ఫేస్‌ను ఫోన్ క్యామ్‌కు చూపిస్తే చాలు, ఫేస్ రికగ్నిషన్‌తో వెంటనే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఓకే అయిపోతుంది.

ఒకవేళ ఇంట్లో మొబైల్ ఫోన్ వాడటం రానివాళ్లు ఉంటే దగ్గర్లోని మీసేవ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ పని చేయించుకోవచ్చు. అదీ కుదరకపోతే మన పోస్టల్ డిపార్ట్‌మెంట్ భలే ఆఫర్ ఇస్తోంది. అంతేకాదు పోస్ట్‌మ్యాన్‌ను ఇంటికే రప్పించుకుని, వాళ్ల దగ్గరుండే మిషన్‌తో ఓపెన్‌గా వేలిముద్ర వేసి ఈ ప్రాసెస్ ముగించొచ్చు.

ఈ పని చేసేటప్పుడు ఆధార్ నెంబర్, పింఛన్ పొందే పీపీఓ (PPO) నెంబర్, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్, ఆధార్ లింకైన ఫోన్ నెంబర్ దగ్గర పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం వల్ల ఎవ్విర్ మంత్ రావాల్సిన పెన్షన్ ఆగిపోతే ఇబ్బందులు మామూలుగా ఉండవు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నవంబర్ 30వ తేదీలోపే ఈ లైఫ్ సర్టిఫికెట్ సబ్‌మిషన్ ఫినిష్ చేసుకుంటే మంచిది.

Dining Manners : తరచూ రెస్టారెంట్‌, హోటల్స్‌కి వెళ్తుంటారా? అయితే ఈ 5 పనులు చేయకండి..

↑
Exit mobile version