Meet A Stranger
మార్నింగ్ నుంచి రాత్రి వరకూ లాప్‌టాప్ స్క్రీన్ల ముందు కూర్చుని టార్గెట్లు, ప్రజెంటేషన్లు, ఇంక్రిమెంట్ల కాంపిటేషన్స్ అంటూ పరుగెత్తే మెట్రో సిటీల యూత్‌లో ఇప్పుడొక స్ట్రేంజర్ మీట్(Meet A Stranger) అనే కొత్త ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది. రోజూ చూసే ఫేస్‌లు, రెగ్యులర్ సర్కిల్ కాకుండా.. అసలు పరిచయమే లేని కొత్త పర్సన్స్‌ను కలుస్తూ మైండ్ రిలీఫ్‌ను వెతుక్కుంటున్నారు.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా స్ట్రేంజర్ మీట్(Meet A Stranger), సింగిల్ మీట్, స్పీడ్ డేటింగ్ అంటూ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. ఉరుకుల పరుగుల లైఫ్‌లో ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి,మైండ్ రీఫ్రెష్ అవ్వడానికి ఇవే చక్కటి వేదికలని యూత్ కూడా ఫీలవుతోంది. అయితే నాణేనికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే ఈ ట్రెండింగ్ కలయికల వెనుక మంచితో పాటు ఊహించని చెడు దాగి ఉందని సిటీ పోలీసులు అంటున్నారు.
ఈ మీటప్‌ల మెయిన్ టార్గెట్.. కొత్త స్నేహాలను ఏర్పరచడం. ఇప్పటి వరకూ ఫ్రెండ్‌షిప్ లేదా డేటింగ్ యాప్స్ ద్వారా చాటింగ్ లేదా కాల్స్‌కే పరిమితమైన నెటిజన్లు, ఇప్పుడు డైరెక్టుగా ఫేస్ టు ఫేస్ కలుసుకోవడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఈవెంట్ నిర్వాహకులు అందరినీ ఒకేచోట చేర్చి, కొద్దిగా సిగ్గుపడే వారిని కూడా గేమ్‌లు, డ్యాన్సులు,పాటలు, ట్యాలెంట్ షోలతో కలిపేస్తున్నారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మాదాపూర్, కేపీహెచ్‌బీ, ఆల్వాల్, పంజాగుట్ట, కూకట్‌పల్లి వంటి హాట్‌స్పాట్ లొకేషన్లలో ఉన్న రెస్టారెంట్లు, కెఫేలు, మాల్స్, పబ్స్, రిసార్టులు, ఫామ్‌హౌస్‌లలో ఈ స్ట్రేంజర్ మీట్(Meet A Stranger) వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా డేట్ అనౌన్స్ చేయగానే లిమిటెడ్ స్లాట్స్ కోసం ఓ రేంజ్‌లో పోటీ ఉంటుందని ఈవెంట్ ఆర్గనైజర్లు అంటున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు ఎక్కువగా ఈ ఈవెంట్స్ ఉంటాయి. ఎంట్రీ వద్ద గెస్ట్‌ల ఆధార్ కార్డులు, బయోడేటా కలెక్ట్ చేయడం, వెల్కమ్ డ్రింక్, స్నాక్స్ ఇవ్వడం, నలుగురితో ఇంట్రడక్షన్ పెంచేలా యాక్టివిటీస్ నిర్వహించడం వంటివి తమ కళ్ల ముందే జరుగుతాయని చెబుతున్నారు. చివరి అరగంటలో మాత్రం నచ్చిన, సేమ్ మైండ్‌సెట్ ఉన్న వ్యక్తులతో కాసేపు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
అయితే ఈ కొత్త పరిచయాలు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇచ్చినా కూడా,సేఫ్టీ విషయంలో కొన్ని స్ట్రిక్ట్ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఇలాంటి ఈవెంట్స్‌కి వెళ్లే ముందు ఎవరైనా సరే.. ముందుగా అక్కడ సెక్యూరిటీ అరెంజ్‌మెంట్స్ ఎలా ఉన్నాయో ఎంక్వయిరీ చేయాలి. ఆల్కహాల్, స్మోకింగ్‌కి పర్మిషన్ ఉన్న ఈవెంట్లను సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటమే బెటర్. ఒకవేళ ప్రైవేట్ ఇళ్లలో లేదా ఫామ్‌హౌస్‌లలో ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తుంటే మాత్రం..లోకల్ పోలీస్ అండ్ కమ్యూనిటీ పర్మిషన్ ఉందో లేదో కచ్చితంగా చెక్ చేసుకోవాలి.
మెయిన్‌గా కెఫేలు, పబ్బులలో ప్లాన్ చేసే సీక్రెట్ పార్టీల పట్ల చాలా అలర్ట్‌గా ఉండాలి. చాలామంది ఈవెంట్ మేనేజర్స్ ఎంట్రీ ఫీజు తక్కువగా చెప్పి, తర్వాత బిల్లుల రూపంలో భారీగా డబ్బులు గుంజే ఛాన్స్ ఉంది. అన్నింటికంటే మెయిన్‌గా..ఎంత కలిసిపోయినా సరే కొత్తగా పరిచయమైన అపరిచితులతో మీ పర్సనల్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదు.
ఒకవేళ ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుని బయట కలవడానికి మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేస్తే ఓకే చెప్పకూడదు. ఇలా చిన్న చిన్న సేఫ్టీ రూల్స్ పాటిస్తే.. కొత్త పరిచయాలు హ్యాపీనెస్‌ను ఇస్తాయి. లేకపోతే అనవసరమైన లీగల్ కాంప్లికేషన్స్‌కి దారి తీసి లేనిపోని తలనొప్పులు వస్తాయి.
Plastic Notes : కాగితపు నోట్లకు గుడ్ బై..రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లతో ఆర్‌బీఐ ప్రయోగం..
