Biggboss Nominations : అగ్నిపరీక్ష వర్సెస్ సెలబ్రిటీలు.. హౌస్‌లో మొలకెత్తిన గ్రూపిజం ..

Biggboss Nominations : వంశీ తాను రోహిత్ టీమ్‌లో ఉన్నా కూడా, అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా ఒకే గ్రూప్‌గా ఉంటూ తన్ను పరాయి వాడిలా చూస్తున్నారని రామ్ ప్రసాద్ టీమ్ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు.

Biggboss Nominations

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కొద్ది గంటల్లోనే బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయిన వాతావరణం కనిపిస్తోంది. నిన్నటి వరకూ నువ్వు తోపు అంటే నువ్వు తోపు అని పొగుడుకున్న కంటెస్టెంట్స్, రెండో రోజే ఒకరి పీక ఒకరు నొక్కుకునే స్థాయికి వెళ్లిపోయారు.

ముందు రోజు ఎపిసోడ్‌లో తాళాలు గెలుచుకున్న పదిమందికి బిగ్ బాస్ పవర్స్ ఇవ్వడంతో మొదలైన డ్రామా, అసలు సిసలైన మహా పరీక్షతో నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. హౌస్‌మేట్స్ అంతా రెండు గ్రూపులుగా మారి రోహిత్, రామ్ ప్రసాద్‌ను లీడర్లుగా పిక్ చేసుకున్నారు. దీంతో ఇక బిగ్ బాస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోహిత్‌కు రెడ్, రామ్ ప్రసాద్‌కి బ్లూ కర్చీఫ్‌లు ఇచ్చి రంగంలోకి దించారు.

లీడర్లు ఓకే.. మరి టీమ్స్ ఎలా ఏర్పడ్డాయంటే.. హౌస్‌లో దాచిన బ్యాగులను వెతికి తెచ్చి లీడర్లకు ఇస్తే, వాటిలో ఉన్న కలర్ బ్యాండ్స్ బేస్ చేసుకుని జట్లుగా విడదీశారు. అలా రామ్ ప్రసాద్ బ్లూ టీమ్‌లోకి ముకేశ్ గౌడ, సుధీర్, దేబ్జానీ, వర్షిణి, కృష్ణుడు, త్రిగుణ్, నరేష్ చేరిపోయారు.

ఇక రోహిత్ రెడ్ టీమ్‌లో అమన్, వంశీ, ఝాన్సీ, చైత్ర రాయ్ షాలిని, సృష్టి, చరణ్, ల్యాండ్ అయ్యారు. అసలు పంచాయితీ స్టార్ట్ ఇక్కడే అయింది. రోహిత్ వేసిన ప్లాన్ వల్ల వర్షిణి.. రామ్ ప్రసాద్ టీమ్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో నన్ను ఎందుకు సెలక్ట్ చేసుకోలేదు బ్రో అంటూ రామ్ ప్రసాద్‌పై వర్షిణి ఫైర్ అయి కాసేపు రచ్చ చేసింది.

ఆ తర్వాత హౌస్‌లో అగ్నిపరీక్ష బ్యాచ్ వర్సెస్ సెలబ్రిటీల టీమ్ అన్న ఇంటర్నల్ ఫీలింగ్స్‌తో మైండ్ గేమ్ నడిచింది. ఒకరి టీమ్ ఇంకొకరిపై తమ అభిప్రాయాలు చెప్పాలని, తమ హౌస్‌మేట్‌గా మారడానికి అస్సలు అర్హత లేని ఓ ఐదుగురి పేర్లు చెప్పాలని బిగ్ బాస్ బిగ్ బాంబు పేల్చారు.

దాంతో నామినేషన్ల (Biggboss Nominations)వేడి రాజుకున్నట్లు అయింది. రామ్ ప్రసాద్ టీమ్ అంతా కలిసి రోహిత్ టీమ్‌లోని చరణ్, అమన్, రోహిత్, సృష్టి, షాలిని పటేల్‌ను అన్‌ఫిట్ అని చెప్పేశారు. దీంతో రోహిత్ టీమ్ అస్సలు ఊరుకోకుండా రామ్ ప్రసాద్ టీమ్‌లోని కృష్ణుడు, రామ్ ప్రసాద్, వర్షిణి, త్రిగుణ, దేబ్జానీ పేర్లు బయటకు లాగి రివెంజ్ తీర్చుకున్నారు.

ఈ నామినేషన్ల (Biggboss Nominations) ప్రక్రియ అంతా ముగిసాక వీరి గొడవలు పీక్స్‌కి వెళ్లాయి. రోహిత్‌పై దేబ్జానీ సీరియస్ అయ్యింది. ఇక కృష్ణుడు అయితే నీకు అసలు లీడర్ అయ్యే సీన్ లేదని తనను తక్కువ అంచనా వేయకు అని స్ట్రాంగ్‌గానే రోహిత్‌కు ఫేస్ టు ఫేస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇటు రామ్ ప్రసాద్ కూడా సిల్లీ రీజన్స్ ఇచ్చావంటూ రోహిత్‌ను కడిగేశాడు. ఈ రచ్చలో వర్షిణి ఏదో మాట్లాడదామని ట్రై చేసింది కానీ ఎవరూ కేర్ చేయలేదు.

ఇక నామినేట్ అయిన వాళ్లందరికీ ప్రొటెక్ట్ బాల్స్ అనే క్రేజీ గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఒక టీమ్ దాడి చేస్తే, ఇంకో టీమ్ దానిని అడ్డుకోవాలి. ఈ గేమ్‌లో రోహిత్ టీమ్ షాలినిని, రామ్ టీమ్ కృష్ణుడిని తమ బాస్‌గా ఎంచుకున్నాయి.

గార్డెన్ ఏరియా, లివింగ్ రూమ్, బెడ్ రూమ్‌ను దాటుకుంటూ వెళ్లి.. పుట్టగొడుగుల దగ్గర ఉన్న తమ బాస్‌ను కాపాడుకోవడమే టాస్క్. యుద్ధంలో గన్స్ ఫైటింగ్ వంటి అట్మాస్పియర్ నెలకొన్న ఈ ఫిజికల్ టాస్క్‌లో కృష్ణుడి టీమ్ తమ బాస్‌ను సేవ్ చేసుకుని విన్ అయింది. అయితే ఈ టాస్క్‌లో కూడా షాలిని అపోజిట్ టీమ్‌తో స్ట్రాంగ్‌గానే గొడవపడింది.

టాస్క్ ముగిసిన తర్వాత హౌస్‌లో కాస్త ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామా నడిచింది. చరణ్ షాలిని పటేల్‌తో ఫ్లర్టింగ్ చేయబోగా, షాలిని ఎందుకో ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకోవైపు వంశీ తాను రోహిత్ టీమ్‌లో ఉన్నా కూడా, అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా ఒకే గ్రూప్‌గా ఉంటూ తన్ను పరాయి వాడిలా చూస్తున్నారని రామ్ ప్రసాద్ టీమ్ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు.

Biggboss Nomination

మరోవైపు చరణ్ ఎవరితోనూ కలవడం లేదంటూ అంతా కలిసి క్లాస్ పీకారు. దేబ్జానీ అయితే కింగ్ నాగార్జున ఇచ్చిన బ్యాడ్జీల్లో డేంజర్ బ్యాడ్జ్‌ను చరణ్‌కి ఇచ్చి ఊహించని షాక్ ఇచ్చింది. నాకు అక్కే దెబ్బేసిందని చరణ్ ఎమోషనల్ అయి ఏడవడంతో.. దేబ్జానీ దగ్గరకు తీసుకుని నేను నీ అక్కనురా అంటూ తిరిగి ఓదార్చింది.

వచ్చే ఎపిసోడ్‌లో ఒక టీమ్ డేంజర్ జోన్‌లోకి వెళ్తుందని బాంబు పేల్చారు బిగ్ బాస్. అయితే మొదటి 2 రోజులు గమనిస్తే.. అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన వాళ్లంతా.. సెలబ్రిటీలతో కలవకుండా, తామంతా ఒకటే అన్నట్లుగా గ్రూప్ గేమ్ ఆడుతున్నట్లు క్లియర్‌గా అర్థమవుతోంది. ఆడియన్స్‌కి కూడా ఈ గ్రూపిజం క్లియర్‌గా కనిపిస్తోంది. మరి ఈ గ్రూపుల గోడలు బద్దలై అసలు గేమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

Vijayasai Reddy : విజయసాయి కొత్త పార్టీ వెనుక కమలం స్కెచ్ ఉందా? రూట్ చేంజ్ వెనుక ఉన్న సీక్రెట్ అదేనా?

Exit mobile version