Final Captaincy
బిగ్ బాస్ హౌస్ రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇటీవలి టాస్కుల్లో సుధీర్ డైరెక్టుగా 13వ వారంలోకి అడుగుపెట్టడంతో హౌస్‌మేట్స్ అంతా అతడిని అభినందించగా, టికెట్ టు ఫినాలే మాత్రం ఎలాగైనా కొట్టేస్తానంటూ సుధీర్ ధీమాను వ్యక్తం చేశాడు. ఆ తర్వాత హౌస్‌లో చిన్నపాటి కిచెన్, వస్తువుల పంచాయితీ స్టార్ట్ అయింది. తన కాఫీ పౌడర్ కనిపించడం లేదని అమన్ ఆరా తీయగా, దాన్ని శివ్ దాచిపెట్టి తీసుకురావడంతో ఇద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ నడిచింది. మరోవైపు తన ప్రోటీన్ పౌడర్ మిస్సయిందంటూ శివ్ కూడా గొడవకు దిగడం ఎపిసోడ్‌లో ఆసక్తి రేపింది.
ఇక సీజన్ చివరి కెప్టెన్సీ(Final Captaincy) పోటీకి టైమ్ వచ్చిందని బిగ్ బాస్ ప్రకటించారు. ఈ కెప్టెన్సీని దక్కించుకుంటే ఫైనల్ వైపు జర్నీని వన్ వీక్ పాటు సేఫ్‌గా ఉంచుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ వారం కంటెండర్ రేసులో నిలవడానికి హౌస్‌మేట్స్‌కు సపోర్ట్‌గా బయట నుంచి బడ్డీస్ వస్తారని తెలిపారు. ముందుగా గత సీజన్ కంటెస్టెంట్లు ఇమ్మాన్యుయేల్, సంజన గల్రాని ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌లోకి రాగానే ఇమ్మాన్యుయేల్ తనదైన శైలిలో పంచ్‌లు, కామెడీ కౌంటర్లతో హౌస్‌లో సందడి చేశాడు. వర్షిణి, ముకేష్, దేబ్జానీతో పాటు కొంతమంది సరదాగా కామెంట్లు చేస్తూనే, గేమ్ పరంగా కొన్ని సూచనలు ఇచ్చాడు. సంజన కూడా తన వంతు సలహాలను ఇచ్చింది.
వీకెండ్‌లో గెలిచిన ముకేష్, త్రిగుణ్, రామ్ ప్రసాద్, శివ్, దేబ్జానీ, రామకృష్ణ కంటెండర్ అవ్వడానికి పోటీ పడ్డారు. బడ్డీస్ ఎవరితో ఆడతారో తేల్చుకోవాలని బిగ్ బాస్ చెప్పగా, రామకృష్ణతో ఇమ్మాన్యుయేల్, త్రిగుణ్‌తో సంజన జతకట్టారు. తర్వాత నిర్వహించిన బాక్స్ పజిల్ టాస్క్‌లో కండీషన్ల విషయంలో త్రిగుణ్, రామకృష్ణ మధ్య గట్టిగా మాటల ఫైట్ జరిగింది.
దీంతో ఇమ్మాన్యుయేల్ జోక్యం చేసుకోగా, ముకేష్, వంశీ, శివ్ కూడా మాటల తూటాలు పేల్చుకున్నారు. అనవసరంగా ముకేష్ గొడవలోకి దూరాడన్న చర్చ నడిచింది. చివరకు ఈ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్, రామకృష్ణ విజయం సాధించడంతో రామకృష్ణ ఫైనల్ కెప్టెన్సీ(Final Captaincy) కంటెండర్‌గా నిలిచాడు. ఇమ్మాన్యుయేల్, సంజన బై చెప్పాక త్రిగుణ్ ఓడిపోవడంపై ముకేష్ వర్గం ఆనందపడటం, ఆ విషయాన్ని త్రిగుణ్ సంచాలక్ అమన్ వద్ద ప్రస్తావించడం హైలైట్ అయింది.
ఆ తర్వాత గెస్ట్‌లుగా దివ్య, కళ్యాణ్ పడాల హౌస్‌లోకి వచ్చి.. వెజిటబుల్స్ పేర్లతో ఉన్న దండలను హౌస్‌మేట్స్ గుణగణాలకు తగ్గట్టుగా వేసే గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో భాగంగా సొరకాయ దండను అమన్ మెడలో వేస్తూ ముకేష్ చేసిన కామెంట్లు ఇద్దరి మధ్య వాదన తలెత్తింది. మిగిలిన నలుగురిలో ఇద్దరిని సెలక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ ఆదేశించగా, కళ్యాణ్ పడాల అందరినీ ఇంటర్వ్యూ చేసి శివ్‌ను ఎంచుకోగా, దివ్య.. రామ్ ప్రసాద్‌ను ఎంచుకున్నారు.
బాల్స్ విసిరి ప్రత్యర్థుల ఫోటోలను చింపే టాస్క్‌లో కళ్యాణ్ పడాల బాల్స్‌ను నీళ్లలో వేసి ఆడటంతో రామ్ ప్రసాద్‌కు అన్యాయం జరిగిందంటూ రామ్ ప్రసాద్, త్రిగుణ్, దివ్య నిలదీశారు. తన టీమ్ గెలుపు కోసం ఏమైనా చేస్తానని కళ్యాణ్ తేల్చి చెప్పాడు. ఈ గొడవలో ముకేష్, దివ్య మధ్య మాటల వార్ జరిగింది. గెస్ట్‌లా ఉండాలన్న కామెంట్‌పై దివ్య ఘాటుగా రియాక్ట్ అయింది. ఉత్కంఠగా సాగిన ఈ టాస్క్‌లో శివ్ గెలిచి ఫైనల్ కెప్టెన్సీ(Final Captaincy) పోటీకి అర్హతను సాధించాడు. మిగిలిన ఇద్దరి కోసం మరో ఇద్దరు బడ్డీలు బుధవారం ఎపిసోడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
