New Captain
బిగ్ బాస్ హౌస్‌లో రోజురోజుకూ డ్రామా ముదురుతోంది. ముందురోజు ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్కులతో పాటు రివెంజ్, రివార్డ్ గేమ్‌లు హౌస్‌లో మరింత హీట్‌ను పెంచేశాయి. ఉదయాన్నే హౌస్‌లో వర్షిణి రోల్‌పై వివాదం చెలరేగింది. వర్షిణి కప్పులు కడగలేదని, ఫుడ్ వేస్ట్ చేసిందని సీరియస్ అయిన కెప్టెన్ త్రిగుణ్.. ఆమెకు మార్నింగ్ చాయ్ ఇవ్వకుండా కట్ చేశాడు. దీంతో రగిలిపోయిన వర్షిణి డైరెక్టుగా ముకేష్‌తో తన అసంతృప్తిని వెళ్లగక్కింది.
మరోవైపు సుధీర్ కూడా ముకేష్, వర్షిణి తనతో ప్రవర్తించిన తీరు మార్చుకున్నారని త్రిగుణ్, వంశీ వద్ద తన ఆవేదనను పంచుకున్నాడు. తనకు చాయ్ ఎందుకు ఇవ్వలేదంటూ త్రిగుణ్తో వర్షిణి ఆర్గ్యూ చేసింది. బాత్రూమ్ క్లీన్ చేసే విషయంలో త్రిగుణ్ అడగడంతో మరోసారి గొడవ పెద్దదైంది. ఈ వివాదంలోకి ముకేష్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది.
ఈ వారం జరిగిన రివార్డ్, రివెంజ్ టాస్క్‌లలో సత్తా చాటిన వంశీ, శ్వేతా, త్రిగుణ్, దేబ్జానీ నామినేషన్స్ గండం నుంచి బయటపడి సేఫ్ జోన్‌లోకి వెళ్లారు. అంతేకాకుండా వీరు రాబోయే వీక్‌లో తమ ఫ్యామిలీ మెంబర్స్‌ను కలుసుకునే అవకాశాన్ని దక్కించుకున్నారు. అయితే రివెంజ్‌కు గురైన రామకృష్ణ, వర్షిణి, అమన్, ముకేష్ మాత్రం ఈ ఛాన్స్‌ను కోల్పోయారు. వీరి పరిస్థితిని చూసి బిగ్ బాస్.. ఈ నలుగురికి మరో ఛాన్స్ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో గెలిచిన వారు మాత్రమే తమ ఫ్యామిలీని కలుసుకోవచ్చని రూల్ పెట్టాడు.
దీంతో ఈ నలుగురు కంటెస్టెంట్లను జంటలుగా డివైడ్ చేసి ఒక సరికొత్త టాస్క్ ఇచ్చారు. వర్షిణి , ముకేష్ ఒక జట్టుగా, అమన్, రామకృష్ణ మరో జట్టుగా బరిలోకి దిగారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో వర్షిణి , ముకేష్ జోడీ విజయం సాధించింది. అయితే ఈ గేమ్‌లో సంచాలక్‌గా వ్యవహరించిన నరేశ్ పక్షపాత ధోరణితో వ్యవహరించాడని, సరిగ్గా గేమ్ ఆడకపోయినా గెలిపించారంటూ హౌస్ మేట్స్ ఫైర్ అయ్యారు. నరేష్‌తో అమన్, రామకృష్ణ గొడవకు దిగగా.. తన తప్పులేదని, కావాలని ఎవరికీ అన్యాయం చేయలేదని నరేష్ వాదించాడు. ఈ గొడవల మధ్య ముకేష్, వర్షిణిలలో ఎవరిని ఫ్యామిలీని కలవడానికి అనుమతిస్తారో తేల్చుకోవాలని బిగ్ బాస్ సూచించాడు. చివరకు ముకేష్ తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి ఎంపికయ్యాడు. తన స్నేహితుడి కోసం వర్షిణి తనకున్న ఫ్యామిలీని కలిసే అవకాశాన్ని త్యాగం చేసి కంటతడి పెట్టుకుంది.
తర్వాత హౌస్‌లో డీజే (DJ) కెప్టెన్సీ టాస్క్‌ను బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. ఈ రేసులో త్రిగుణ్, వంశీ, శ్వేతా, దేబ్జానీ కంటెండర్లుగా నిలిచారు. ఈ గేమ్‌లో మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు మిగతా హౌస్ మేట్స్ అంతా డాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగిపోగానే ఎవరైతే ముందుగా పరిగెత్తి గంటను కొడతారో, వారు ఒక దండను తీసుకుని తమకు ఏ కెప్టెన్ అయితే ఇష్టమో వారి మెడలో వేయాలి. హౌస్ మేట్స్ అందరి మద్దతు కూడగట్టుకునే ఈ ప్రాసెస్‌లో డిఫరెంట్ ఫలితాలు వచ్చాయి.
దీనిలో వర్షిణి తన ఓటును శ్వేతాకు వేయగా, శివ్ మాత్రం వంశీ వైపు నిలిచాడు. నరేష్, సుధీర్, రామకృష్ణ, రామ్ ప్రసాద్, నీతూ మాస్టర్ అందరూ వంశీకి మద్దతుగా దండలు వేశారు. మరోవైపు ముకేష్, అమన్ మాత్రం శ్వేతాను కెప్టెన్‌గా కోరుకుంటూ ఆమెకు దండలు వేశారు. చివరకు మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో వంశీ ఈ వీక్ హౌస్ కెప్టెన్‌గా(New Captain) ఘన విజయం సాధించారు. కెప్టెన్(New Captain)గా గెలిచిన వెంటనే వంశీని క్లోజ్ ఫ్రెండ్ త్రిగుణ్ సంతోషంతో భుజాలపై ఎక్కించుకుని హౌస్ అంతా తిప్పాడు.
