Diwali Main Door Vastu : దీపావళి రోజు రాత్రి తలుపులు తెరిచి ఉంచాలా? పెద్దలు చెప్పిన వాస్తు రహస్యం ఏంటి?

Diwali Main Door Vastu : దీపావళి రాత్రి ఇంటి ప్రధాన తలుపులు తెరిచి ఉంచడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం, వాస్తు విశ్వాసాలు ఏంటో తెలుసుకోండి. లక్ష్మీదేవి, కుబేరుని కటాక్షం కోసం పాటించే ఈ ఆచారం విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

Diwali Main Door Vastu

చీకటిని తరిమేసి వెలుగులను లోకానికి పంచే దీపావళి పండుగ అంటేనే చిన్నా పెద్దా అందరికీ చాలా ఇష్టం. నవంబర్ 8వ తేదీన రాబోతున్న ఈ కలర్‌ఫుల్ మతాబుల పండుగ కోసం అందరూ ఇళ్లను అందంగా ముస్తాబు చేయడం, రకరకాల దీపాలతో అలంకరించుకోవడం చేస్తుంటారు. అయితే ఈ పండుగ రోజు పెద్దలు పాటించే ప్రత్యేకమైన ఆచారాలు కొన్ని ఉంటాయి.

అందులోనూ ఇంటి ప్రధాన ద్వారానికి(Diwali Main Door Vastu) సంబంధించి ఒక ఆసక్తికరమైన ఆచారం లేదా నమ్మకం ఎప్పట్నుంచో ప్రాచుర్యంలో ఉంది. సాధారణంగా దీపావళి పండగ రోజు ఇళ్ల శుభ్రతకు, అలంకరణకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తాం. అతిథులు, శుభ శక్తులు అన్నీ ప్రధాన ద్వారం నుంచే లోపలికి వస్తాయనే నమ్మకంతో గుమ్మాన్ని మామిడి ఆకుల తోరణాలు, రంగురంగుల ముగ్గులతో ప్రత్యేకంగా కళకళలాడేలా తీర్చిదిద్దుకుంటాం.

అయితే దీపావళి రోజు ప్రదోష కాలం నుంచి నిశీథ కాలం వరకు అంటే సుమారు సాయంత్రం సుమారు 6:00 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 గంటల వరకు ఇంటి మెయిన్ డోర్‌ను పూర్తిగా మూసేయకుండా కొద్దిగా తెరిచి ఉంచాలనే ఒక ఆచారం ఉంటుంది. దీని వెనుక బలమైన ఆధ్యాత్మిక కారణం కూడా దాగుంది.

దీపావళి రోజు ఆ సమయంలో భూలోకంలో సంచరించే లక్ష్మీదేవి, కుబేరుడు పరిశుభ్రంగా, దీపకాంతులతో వెలిగిపోయే ఇళ్లలోకి డైరెక్ట్‌గా ప్రవేశిస్తారని నమ్ముతారు. తలుపులు బిగించి ఉంచుకుంటే సిరుల తల్లి వెనక్కి వెళ్తుందని, అందుకే వెలుగులు ప్రసరించే ఆ తెరిచిన ద్వారమే దేవతలను ఆ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానిస్తుందని పెద్దలు విశ్వసిస్తారు. అందుకే కాలం ఎంతగా మారుతున్నా, ఈ చిన్న నమ్మకాన్ని, సంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరిగా పాటిస్తుంటారు.

SmartPhone Prices : మొబైల్స్‌పై ఏఐ ఎఫెక్ట్.. 30 శాతం వరకు పెరగనున్న ఆండ్రాయిడ్ ఫోన్ల ధరలు

↑
Exit mobile version