Khairatabad Ganesha
హైదరాబాద్ నడిబొడ్డున ప్రతీ ఏడాది దర్శనమిచ్చే ఖైరతాబాద్ బడా గణేశుడిని(Khairatabad Ganesha) చూడటానికి ఇతర జిల్లాల నుంచే కాదు వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు. కెమెరా క్లిక్కులు, భక్తుల జయ జయ ధ్వనుల మధ్య ఆ మహామూర్తి రూపం భక్తి పారవశ్యంతో కట్టిపడేస్తుంది.
ఆ భారీ గణనాధుని పాదాల దగ్గర నిలబడి పైకి చూస్తే..ఇంత భారీ విగ్రహాన్ని ఎలా నిలబెట్టారనే సందేహం వస్తుంటుంది. అయితే ఈసారి అలాగే కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతి 69 అడుగుల రూపం వెనుక కేవలం భక్తి, ఆశ్చర్యం మాత్రమే లేదు. ఒక పక్కా ఆటోమొబైల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అద్భుతం దాగుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రతీ ఏడాది ఈ విగ్రహం తయారీని మే లేదా జూన్ నెలలోనే ప్రారంభిస్తారు. నిర్జల ఏకాదశి రోజు మొదటి కర్రనాటి ఈ మహాయజ్ఞం ఆరంభిస్తారు. 1954లో ఒక్క అడుగు గణపతిగా మొదలైన ఈ ఉత్సవ ప్రయాణం.. దశాబ్దాలు గడిచేసరికి 70 అడుగుల ఆకాశాన్ని తాకే ఎత్తుకు పెరిగింది. అయితే పర్యావరణ స్పృహ పెరగడంతో, కరోనా సమయం నుంచి.. ప్రతి ఏటా ఒక అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. కానీ ఈ ఏడాది 69 అడుగుల హైట్‌ను ఫిక్స్ చేశారు.
69 అడుగుల గణేషుడి భారీ విగ్రహం అంటే కొన్ని వందల టన్నుల బరువుంటుంది. వానలు పడినా, బలమైన ఈదురుగాలులు వీచినా ఆ విఘ్నేశ్వరుడి విగ్రహం చెక్కుచెదరకుండా ఉండటానికి.. తమిళనాడు, ఒడిశా, ఏపీ, తెలంగాణ నుంచి వచ్చిన 150 మంది ఎక్స్‌పర్ట్స్ అయిన శిల్పులు ఒక ప్రత్యేకమైన స్ట్రక్చర్‌ను డిజైన్ చేశారు.
ముందుగా 30 టన్నుల పవర్ ఫుల్ స్టీల్ రాడ్లు పెట్టి.. మెష్‌తో లోపలి ఫ్రేమ్‌వర్క్‌ను నిలబెట్టి, దానికి సపోర్ట్‌గా 22 టన్నుల చెక్క దిమ్మెలను లాక్ చేశారు. అంటే బిల్డింగ్ నిర్మాణానికి పిల్లర్లు వేసినట్లే, ఇక్కడ కూడా లోపల ఒక హిడెన్ ఐరన్ స్ట్రక్చర్ ఉంటుంది.
ఇక పర్యావరణ పరిరక్షణ విషయంలో కూడా ఈ ఉత్సవ సమితి ఈసారి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) కానీ రసాయన రంగులను కానీ చిన్నది కూడా వాడకుండా.. రాజస్థాన్ ఎడారి సరిహద్దుల నుంచి 1000 బస్తాల నది ఒండ్రు మట్టిని ప్రత్యేకంగా తెప్పించారు.
దానికి ఇసుక, ఆ మట్టిని పక్కా నిష్పత్తిలో కలిపి విఘ్నాధిపతి విగ్రహానికి ఔటర్ షేప్ ఇచ్చారు. విగ్రహం ఆరిపోయి గట్టిపడినపుడు గాలి చొరబడి పగుళ్లు రాకుండా ఉండటం కోసం.. సుతిలి తాళ్ల పొడిని, ఎండిన వరి గడ్డి చూర్ణాన్ని ఒక నేచురల్ బైండర్‌గా వేశారు. చివరికి సున్నితమైన వాటర్ కలర్స్‌తో రూపాన్ని తీర్చిదిద్దారు.
కేవలం తయారీ ఒక్కటే కాదు.. ఈ 90 రోజుల పాటు 150 మంది కళాకారులు ప్రతీ రోజూ 12 నుంచి 14 గంటలు కష్టపడ్డారు. సుమారు 7,000 గంటల పాటు మనుషుల కష్టం ఈ ఒక్క మహామూర్తి వెనుక ఉంది. వినాయకుడి పక్కనే ఉండే పార్శ్వ విగ్రహాలను కూడా ఇదే మెథడాలజీ వాడి రీసైకిలబుల్ స్టీల్ మౌల్డింగ్స్ చేసి నిలబెట్టారు.
లంబోధరుడి విగ్రహం పూర్తయ్యాక జరిగే పూజలు, భారీ లడ్డు నైవేద్యం ఒక ఎత్తయితే.. ఆ తర్వాత జరిగే నిమజ్జనం మరో ఎత్తుగా నిలుస్తుంది. 69 అడుగుల మట్టి విగ్రహాన్ని నిమజ్జనం(Khairatabad Ganesha) కోసం కదల్చడమంటే సాధారణ విషయం కాదు.
అందుకే దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మహా ట్రాలీపైకి విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని చేర్చి, రోడ్డుకి రెండు వైపులా ఉన్న కరెంట్ వైర్లు, చెట్ల కొమ్మలను క్లియర్ చేసుకుంటూ హుస్సేన్ సాగర్ దాకా తీసుకుని వెళ్తారు. పర్యావరణానికి చిన్నపాటి ముప్పు కూడా రానీకుండా నిమజ్జనాన్ని పూర్తయ్యేలా చూస్తారు.
Super Sports Sunday : ఈరోజు స్పోర్ట్స్ ఫ్యాన్స్‌కి పూనకాలే..భారత్ ఖాతాలో ఆ 4 కప్పులు పడతాయా?
