Seed Ganesh
వినాయక చవితి వస్తుందంటే వారం రోజుల ముందు నుంచే వీధివీధిలో మైకులు, లైటింగ్‌లు, కలర్‌ఫుల్ మండపాలతో పండుగ వాతావరణం పీక్స్‌కి వెళ్తుంది. బొజ్జ గణపతిని పూజించాక.. నవరాత్రులు గడిచాక ఆ విగ్రహాలను చెరువుల్లో, నదుల్లో నిమజ్జనం చేసేటప్పుడే అసలైన పర్యావరణ సమస్య వచ్చిపడుతుంది.
పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP), విషపూరితమైన కెమికల్ రంగులతో చేసిన విగ్రహాలను కొనడం వల్ల నిమజ్జనం సమయంలో తాగునీటి మూలాలు కలుషితమైపోతున్నాయి. భక్తి పేరుతో మనందరం చేసే చిన్న పొరపాటు ప్రకృతికి ముప్పుగా మారుతోంది. సరిగ్గా ఈ పాయింట్‌నే టచ్ చేస్తూ గణేశుని పండుగ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, మన హెల్త్‌తో పాటు ప్యూర్ గాలిని ఇచ్చే ఒక సామాజిక బాధ్యత అని చాటిచెప్పడానికి మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు.
ప్రతీ ఒక్కరూ పర్యావరణ రక్షణను తమ సొంత బాధ్యతగా తీసుకుని, ఈసారి వినాయక చవితికి అందరూ సీడ్ గణేషుడిని అంటే విత్తనాలతో కూడిన వినాయక ప్రతిమ మాత్రమే పూజించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కంపెనీ అద్భుతంగా తయారు చేసిన సీడ్ గణేష్ విగ్రహాలను హైదరాబాద్‌లోని తన నివాసంలో చిరంజీవి స్వయంగా ఆవిష్కరించారు.
ఈ ఈవెంట్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణను మహా యజ్ఞంలా భావించి, ఇప్పటివరకు 20 కోట్ల మొక్కలు నాటించి.. కోట్లాది మంది ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చిన సంతోష్ కుమార్‌ను ఈ సందర్భంగా మెగాస్టార్ మనస్ఫూర్తిగా అభినందించారు.
భగవంతుని ఆశీస్సులంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదన్న చిరంజీవి.. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే అసలైన పుణ్యమని అన్నారు. సాధారణంగా మట్టి వినాయకుడిని మనందరం వాడుతున్నాం కానీ ఈ సీడ్ గణేష్ కాన్సెప్ట్ అంతకంటే ఒక అడుగు ముందుగా ఉందని చెప్పారు. వినాయకుడిని నిష్ఠగా పూజిస్తే కలిగే పుణ్యంతో పాటు సొసైటీకి మేలు చేసే మొక్కలు నాటే కార్యక్రమం కూడా పూర్తవుతుందని చిరంజీవి వివరించారు.
రకరకాల మొక్కల విత్తనాలను వేసి ఈ గణేషుని ప్రతిమలను తయారు చేస్తారు. పూజా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ఈ విగ్రహాన్ని బయట నదుల్లోనో, చెరువుల్లోనో కాకుండా.. మన ఇంట్లోనే ఒక చిన్న నీటి తొట్టె లేదంటే కుండీలో నిమజ్జనం చేయాలి. కొద్దిసేపట్లోనే ఆ మట్టి బొమ్మ నీటిలో పూర్తిగా కరిగిపోయి.. తర్వాత అందులో ఉన్న విత్తనాలు మొలకెత్తి, కొద్ది రోజుల్లోనే ఒక పచ్చని మొక్కగా మొలకెత్తుతాయి. మనం పూజించిన ఆ స్వామియే స్వయంగా ఒక పచ్చని చెట్టుగా మారి మన ఇంట్లో కొలువుదీరి మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు అవుతుందన్న మాట.
ఈ అద్భుతమైన కాన్సెప్ట్‌ను కేవలం ఒక్కరిద్దరితో ఆపొద్దని.. పర్యావరణ ఉద్యమంగా దీనిని మార్చాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు కోరుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు, పెద్ద పెద్ద హౌసింగ్ సొసైటీలు, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు, ఆలయ కమిటీలు కూడా ముందుకొచ్చి ఈ ఎకో-ఫ్రెండ్లీ సీడ్ గణేషులను తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ వినాయక చవితిని వినూత్నంగా, అర్థవంతంగా జరుపుకొంటూనే .. ప్రతీ ఇంటా ఒక విత్తన గణపతితో మన ప్రకృతిని కాపాడుకునే ఈ గ్రీన్ కాజ్‌లో భాగస్వాములమవుదాం.
This Ganesh Chaturthi, I am happy to have Megastar Chiranjeevi garu unveil and launch the #SeedGanesha campaign. 🙏
Seed Ganesha is a small effort to bring together devotion and care for nature. Made with natural materials and seeds, the idol can be immersed at home after the… pic.twitter.com/iFcpX8D6En
— Santosh Kumar J (@SantoshKumarBRS) August 31, 2026
Vijay For PM : విజయ్ ఫర్ పీఎం ప్రచారంతో చెన్నైలో అగ్గి..కాంగ్రెస్ వర్సెస్ టీవీకే
