GV Narayana : స్నేహానికి మెగాస్టార్ గ్రాండ్ రెస్పెక్ట్.. సీనియర్ నటుడికి చిరంజీవి ఎమోషనల్ వీడ్కోలు..

GV Narayana : 1977 లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న రోజుల్లో తెలుగు యూనివర్సిటీ సీనియర్ విద్యార్థిగా ఉన్న నారాయణ రావు పరిచయమయ్యారని చిరు చెప్పారు.

GV Narayana

సీనియర్ నటుడు జి.వి. నారాయణ రావు ఆగస్ట్ 27 వ తేదీ ఉదయం ఆకస్మికంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలిసినప్పటి నుంచి బాగా ఎమోషనల్ అయిన మెగాస్టార్ చిరంజీవి, ఈరోజు ఆయన నివాసానికి చేరుకుని పార్థివదేహానికి అశ్రునయనాలతో నివాళులు అర్పించారు.

ఒకప్పుడు ఇద్దరూ స్నేహితులే కానీ ఇప్పుడు వారిలో చిరు మెగాస్టార్ అయిపోయారు కాబట్టి.. నారాయణ(GV Narayana) రావు నివాసానికి చిరంజీవి చివరిసారి చూడటానికి వెళతారా అని చాలామంది అనుకున్నారు. కానీ స్నేహానికి ఉన్న విలువను చాటుతూ స్నేహితుడిని కడసారి చూసుకోవడం కోసం మెగాస్టార్ అక్కడికి వెళ్లడం అందరినీ కదిలించింది.

అంతేకాదు నారాయణ(GV Narayana) రావుతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధాన్ని, ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి కంటతడి పెట్టుకున్నారు. 1977 లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న రోజుల్లో తెలుగు యూనివర్సిటీ సీనియర్ విద్యార్థిగా ఉన్న నారాయణ రావు పరిచయమయ్యారని చిరు చెప్పారు.

సినీ ఇండస్ట్రీలో ఎలా అడుగులు వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అప్పట్లో సీనియర్‌గా ఆయన ఇచ్చిన విలువైన సలహాలే తమ మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్‌కు పునాది వేశాయని చిరంజీవి చెప్పారు. మెల్లగా ఆ స్నేహం మరింత గట్టిపడిందని, అప్పటికీ ఇప్పటికీ నారాయణ రావుతో ఉన్న సాన్నిహిత్యం, అభిమానం ఏ మాత్రం తగ్గలేదని గుర్తు చేసుకున్నారు.

కేవలం యాక్టర్‌గానే కాకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (‘మా’) అభివృద్ధికి..జి.వి. నారాయణ రావు చేసిన సేవలు అమోఘమని చిరంజీవి చెప్పుకొచ్చారు. ‘మా’ బాధ్యతలు చేపట్టినప్పుడు అసోసియేషన్‌కు సొంత భవనం ఉండాలంటూ నారాయణ రావు గట్టిగా పట్టుబట్టారని, ఆయన పట్టుదల, దూరదృష్టి వల్లే ఈరోజు ‘మా’కు సొంత బిల్డింగ్ సాధ్యమైందని తెలిపారు. ఒక సంస్థను నిలబెట్టడానికి ఆయన చూపిన అంకితభావం ఎందరికో మార్గదర్శకమని అన్నారు.

GV Narayana

అంతేకాకుండా సరిగ్గా పది రోజుల క్రితమే నారాయణ రావు చిరంజీవిని కలిశారనే విషయం అందరినీ మరింత భావోద్వేగానికి గురిచేసింది. ఐదుగురు కుర్రాళ్లు, పెద్దవాళ్ల మధ్య సాగే వినూత్న కథాంశంతో తాను ఒక సినిమా తీశానని తన తాజా ప్రాజెక్ట్ గురించి చిరంజీవికి నారాయణ రావు వివరించారట.

తన ఫ్రెండ్స్‌తో కలిసి నిర్మించిన ఆ చిత్రం టీజర్‌ను మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని, త్వరలో జరగబోయే ఆడియో ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్‌గా రావలసిందిగా కోరారట. మెగాస్టార్ సపోర్ట్ ఉంటే సినిమా అందరికీ చేరువవుతుందని ఆశపడ్డారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.కానీ తన కోరిక నెరవేరకుండానే..మూవీ రిలీజ్ కాకముందే నిన్న నారాయణ రావు మరణించడం అత్యంత విచారకరమని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.

Konda Surekha : సీఎం రేవంత్‌కు గోల్డ్ రాఖీ కట్టిన సురేఖ..రక్షా బంధన్‌తో పొలిటికల్ రచ్చకి ఎండ్ కార్డ్ పడుతుందా?

Exit mobile version