Dacoit Movie : డెకాయిట్ గా అడివి శేష్ మెప్పించాడా ?…రొమాంటిక్ యాక్షన్ మూవీ రివ్యూ

Dacoit Movie : అడివి శేష్. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ తాజగా డెకాయిట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు

Dacoit Movie

టాలీవుడ్ లో కొందరు హీరోలు మినిమమ్ గ్యారెంటీగా పేరు తెచ్చుకున్నారు. అటు ప్రేక్షకులను అలరించే విషయంలోనైనా, ఇటు నిర్మాతకు కనీస లాభాలు తెచ్చే విషయంలోనైనా ఆ హీరోలు తమకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్నారు. ఈ జాబితాలో ఖచ్చితంగా ఉండే హీరో అడివి శేష్. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ తాజాగా డెకాయిట్ మూవీతో(Dacoit Movie) ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

ఇప్పటి వరకూ యాక్షన్‌, దేశభక్తి, థ్రిల్లర్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ వంటి కథలతో విజయాలు అందుకున్న అడవిశేష్ ట్రెండ్ మార్చాడు. లవ్‌, ఎమోషనల్‌, యాక్షన్‌ ప్రధానాంశాలుగా డెకాయిట్ మూవీ(Dacoit Movie) చేశాడు. దీనిలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. శానిల్‌ డియో దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో ఎస్‌ ఎస్‌ ప్రొడక్షన్స్, సునీల్‌ నారంగ్‌ ప్రొడక్షన్స్ పతాకాలపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది.

కథ ః
హరిదాస్ (అడివి శేష్) సరస్వతి( మృణాల్ ఠాకూర్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయం సరస్వతి అన్నకు తెలుస్తుంది. దీంతో హరిదాస్ కు సపోర్ట్ చేస్తున్న మల్లి(కామాక్షి భాస్కర్ల)పై అఘాయిత్యానికి పాల్పడతారు. దీంతో అతన్ని చంపేసిన హరిదాస్ జైలుకు వెళతాడు. మల్లిపై హరిదాస్ అఘాయిత్యానికి పాల్పడితే, తన అన్న అడ్డుపడితే చంపేసాడంటూ సరస్వతి తప్పుడు సాక్ష్యం చెబుతుంది.

దీంతో 13 ఏళ్లు జైల్లోనే ఉన్న హరిదాస్ ఆమెపై కోపంతో రగిలిపోతాడు. జైలు నుంచి తప్పించుకుని సరస్వతి దగ్గరకు వెళతాడు. అప్పటికి ఆమె పెళ్లి చేసుకుంటుంది. ఒక కూతురు కూడా ఉంటుంది. భర్త గుండె మార్పిడికి సంబంధించిన సమస్యతో బాధపడుతుండగా.. దాని కోసం కోటి రూపాయలు అవసరమవుతాయి.

ఆమె పరిస్థితి చూసిన హరిదాస్ సాయం చేయాలనుకుంటాడు. కరోనా పేరుతో అప్పుడు జరుగుతున్న దోపిడీని చూసి డబ్బు దొంగతనానికి ప్లాన్ వేస్తాడు. మరి ఈ ప్లాన్ సక్సెస్ అయిందా? సరస్వతిని ఇరికించేందుకు హరి వేసిన స్కెచ్ ఏంటి ? తనను మోసం చేసిన సరస్వతికి హరి ఎందుకు సాయం చేయాలనుకున్నాడు ? ఎలాంటి త్యాగం చేశాడనేది మిగిలిన కథ.

అడివి శేష్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని చివరి వరకూ థియేటర్లో కూర్చోబెడుతూ ఉంటుంది. ఈ సినిమాకు కూడా కథ, స్క్రీన్ ప్లే అడివి శేష్ అందించాడు. అయితే తన గత సినిమాలతో పోల్చుకుంటే కాస్త స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. జైలు జీవితం నుంచి మొదలుపెట్టి ప్రేమకథను రివీల్ చేయడం, హరి జైలుకి ఎందుకు వచ్చాడన్న కథతో ఫస్టాఫ్ ముగించారు.

Dacoit Movie

జైలు నుంచి తప్పించుకున్నాక సరస్వతి పరిస్థితి చూసి సాయం చేయాలనుకోవడం లాంటివి గతంలో పలు సినిమాల్లో చూసినట్టే ఉంటాయి. హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించిందో తెలిపే సన్నివేశం సినిమాను కాస్త నిలబెట్టింది. నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే అడివి శేష్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జైల్లో యాటిట్యూడ్, ప్రేమలో ఉన్నప్పుడు అమాయకంగా ఆకట్టుకున్నాడు. సీతారామం సినిమా తర్వాత మృణాల్ కి చాలా మంచి రోల్ దక్కింది.

చాలా చోట్ల ఎక్స్ ప్రెషన్స్ తోనే కట్టిపడేసింది. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ వంటి నటులు పరిధిమేరకు నటించారు. బీజీఎం పర్వాలేదు. సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్ మరింత బలంగా ఉండేలా కొన్ని సన్నివేశాలు పెట్టి ఉండాల్సింది. అక్కడక్కడా కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే డెకాయిట్ నచ్చుతుంది.

Kaleshwaram Project : అన్నదాత ఆశల ప్రాజెక్టు కాళేశ్వరానికి ఆటంకాలెందుకు? మరి రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?

Exit mobile version