Irumudi : బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా ర్యాంపేజ్..4 రోజుల్లోనే రూ.100 కోట్లు కొల్లగొట్టేసిన ఇరుముడి

Irumudi : రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే కల్ట్ రెస్పాన్స్ దక్కించుకున్న ఇరుముడి సినిమా.. కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసేసింది.

Irumudi

సరైన మాస్ కంబ్యాక్ పడితే బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి ఊచకోత ఉంటుందో మాస్ మహారాజా రవితేజ మరోసారి ప్రూవ్ చేశారు. సుమారు ఐదేళ్లుగా ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ, తన కసినంత ఒకే ఒక్క సినిమాతో థియేటర్లలో చూపించారా అన్న రేంజ్‌లో మూవీ కలక్షన్స్ పరుగులు పెడుతున్నాయి.

శివ నిర్వాణ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మించిన ..ఇరుముడి(Irumudi) మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ దండయాత్ర చేస్తోంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే కల్ట్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ ఎంటర్‌టైనర్, కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసేసింది. రవితేజ కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ రూ. 100 క్రోర్ సినిమాగా ఎవరూ ఊహించని సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది.

సాధారణంగా ఎంత పెద్ద స్టార్ సినిమాకి అయినా సరే వీకెండ్ ముగిసి ఫస్ట్ సోమవారం రాగానే కలెక్షన్లలో డ్రాప్ రావడం కామనే. కానీ ఇరుముడి విషయంలో ట్రేడ్ పండితుల లెక్కలు మొత్తం తలకిందులైపోయాయి. వర్కింగ్ డే అయిన నాలుగో రోజు కూడా ఈ మూవీ ఫస్ట్ డే ఏ రేంజ్‌లో వసూళ్లు సాధించిందో, సరిగ్గా అదే రేంజ్‌లో థియేటర్ల దగ్గర కురిపిస్తున్న వసూళ్ల వర్షాన్ని చూసి సినీ వర్గాలు షాక్ అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో రీజనల్ చిత్రాల రికార్డులన్నిటిని తిరగరాస్తూ, నాలుగో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్‌లో ఆల్ టైమ్ బెంచ్‌మార్క్ బాహుబలి 2 తర్వాత ఆ క్రెడిట్ సాధించిన ఏకైక రెండో మూవీగా ఇరుముడి సరికొత్త రికార్డును తన అకౌంట్‌లో వేసుకుంది.

Irumudi

ఇప్పటికే థియేటర్లలో ఏకంగా 38 లక్షలకు పైగా టికెట్లు సేల్ అవడం.. ఈ సినిమా మేనియా ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పేస్తోంది. ఈ మూవీని కొన్న చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా నాలుగు రెట్ల లాభాలు తెచ్చిపెడుతూ.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లకొట్టడానికి దూసుకుపోతోంది.

మొత్తంగా విమర్శకుల ప్రశంసలు, ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథంతో ఇరుముడి మూవీ.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్‌మార్క్స్ సెట్ చేస్తోంది.మరి ముందు ముందు ఈ మూవీ ఎలాంటి రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

Dharman : రజనీకాంత్ నయా మూవీలో శ్రియ .. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ ఫోటో

Exit mobile version