Jananayagan:ఎన్నికలు ముగిశాయి.. మరి బాక్సాఫీస్ వద్ద జననాయగన్ హంగామా ఎప్పుడు?

Jananayagan: ఎన్నికల వేడిలో సినిమాను రిలీజ్ చేస్తే అనవసర వివాదాలు తలెత్తుతాయన్న ఆలోచనతో, పోలింగ్ ముగిసే వరకు వెయిట్ చేసి చూడాలని నిర్ణయించుకున్నారు.

Jananayagan

తమిళ స్టార్ హీరో విజయ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా భావిస్తున్న జననాయగన్ రిలీజ్‌పై కొంతకాలంగా నీలినీడలు కమ్ముకున్నాయి. నిజానికి ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉన్నా సరే, ఊహించని న్యాయపరమైన చిక్కులు , సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది.

మరోవైపు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఈసారి తమిళనాడు ఎన్నికల బరిలో నిలవడంతో, మూవీ రిలీజ్‌పై రాజకీయ ప్రభావం ఉండి విజయ్ గెలుపోటములపై పడే ఛాన్స్ ఉందనే ఉద్దేశంతో మేకర్స్ కూడా వెనక్కి తగ్గారు. అంతేకాకుండా ఎన్నికల వేడిలో సినిమాను రిలీజ్ చేస్తే అనవసర వివాదాలు తలెత్తుతాయన్న ఆలోచనతో, పోలింగ్ ముగిసే వరకు వెయిట్ చేసి చూడాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో, ఆడియన్స్‌లో, విజయ్ ఫ్యాన్స్‌లో మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రస్తుతం తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ ముగిసి ప్రశాంత వాతావరణం నెలకొనడంతో, జననాయగన్(Jananayagan) రిలీజ్‌కు ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయిందని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో సెన్సార్ బోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్న కొన్ని అభ్యంతరాలను త్వరగా సాల్వ్ చేసుకుని, మే నెలలో సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మూవీ యూనిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తుండటంతో పాటు మే నెలలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ ఇచ్చే భారీ సినిమాలు ఏమీకూడా లేకపోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారబోతోంది. సెలవుల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే జననాయగన్ వసూళ్ల పరంగా నయా రికార్డులను సృష్టించే ఛాన్స్ ఉందని ఇటు విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Jananayagan

దీంతో చాలా రోజుల నుంచి అభిమానుల ఉత్కంఠను గమనిస్తున్న మేకర్స్ కూడా వీలైనంత త్వరగా దీనిపై అఫీషియల్ ప్రకటన విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కోర్టు కేసుల వ్యవహారం ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది. కాకపోతే కేవలం టెక్నికల్ కారణాల వల్ల జననాయగన్(Jananayagan) రిలీజ్ డేట్‌ను ప్రకటించడం లేదని కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది.

దళపతి విజయ్ రాజకీయ ప్రస్థానం మొదలైన తర్వాత రిలీజవుతున్న మూవీ కావడంతో, దీనిపై సినీ అండ్ పొలిటికల్ వర్గాల నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి మే నెలలోనే విజయ్ తన విశ్వరూపాన్ని థియేటర్లలో చూపిస్తారా లేక సెన్సార్ చిక్కుల వల్ల మరికొంత కాలం ఎదురుచూపులు తప్పవా అనేది మూవీ యూనిట్ ఇచ్చే అప్డేట్‌తోనే తేలబోతోంది.

Constipation:మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టండి.. అపాన ముద్రతో జీర్ణ వ్యవస్థను స్ట్రాంగ్ చేసుకోండి

Exit mobile version