Kaaka
మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్..ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఒక్కసారిగా వేడెక్కించేలా చేసింది. మెగాస్టార్ చిరంజీవి , మాస్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో రాబోతున్న మాసియెస్ట్ మూవీ కాకా(Kaaka)పై క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది.
కాకా(Kaaka) సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని కొంతకాలంగా రకరకాల ఊహాగానాలతో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారిక విడుదల తేదీని ఎనౌన్స్ చేసి, సోషల్ మీడియాను షేక్ చేసేసింది.
2027 సంక్రాంతి పండగ కానుకగా జనవరి 13వ తేదీన కాకా మూవీ.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ వెంకట్ నారాయణ పాన్ ఇండియా రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో, మైండ్ బ్లోయింగ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
గతంలో చిరంజీవి, బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతి బరిలోనే రేసులోకి దిగి బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతూ.. అదే సంక్రాంతి పండగ సెంటిమెంట్‌తో రానుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అన్ని ఊహాగానాలకు ఎండ్ కార్డ్ వేస్తూ.. 2027 సంక్రాంతి బరిలోకి కాకా వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి , డైరెక్టర్ బాబీ కలయికలో వస్తున్న మా చిత్రం 2027 జనవరి 13వ తేదీన థియేటర్లలో సందడి చేస్తుంది. త్వరలోనే మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ సింగిల్‌తో ప్రమోషన్ల హంగామా షురూ చేస్తామని చెబుతూ కేవీఎన్ ప్రొడక్షన్స్ తమ సోషల్ మీడియా పోస్టు రిలీజ్ చేశారు . ఈ ఒక్క ప్రకటనతోనే మెగా ఫ్యాన్స్‌లో ముందే పండగ వాతావరణం నెలకొంది.
రిలీజ్ డేట్ ఒక్కటే కాకుండా ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ కూడా రావడంతో ప్రమోషన్ల స్పీడ్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందని చిరు ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. మరి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి కాకాగా వస్తున్న మెగాస్టార్, వచ్చే సంక్రాంతికి ఎలాంటి మాస్ జాతర క్రియేట్ చేస్తారో చూడాలి.
Putting all the speculation to rest, #KAAKA is releasing for Sankranthi 2027🔥
Our much anticipated film with Megastar @KChiruTweets Garu and @DirBobby will arrive in cinemas worldwide on JANUARY 13, 2027.
First Single Soon🕺🎶 #KAAKAOnJan13 #KVNProductions pic.twitter.com/0vAHB4ZVPy
— KVN Productions (@KvnProductions) September 17, 2026
The Paradise : నార్త్ అమెరికాలో నాని జడల్ జాతర..ది ప్యారడైజ్ నయా రికార్డ్
