Lice Gnawer
తల మీద కానీ గడ్డం భాగంలో హఠాత్తుగా గుండ్రంగా, సరిగ్గా రూపాయి నాణెం సైజులో వెంట్రుకలు ఊడిపోయి, అక్కడ చర్మం నునుపుగా ,మృదువుగా కనిపిస్తే దాన్ని పేను కొరుకుడు అంటారు. అయితే పేలు కొరకడం వల్ల లేదంటే ఇంట్లో బొద్దింకలు తిరగడం వల్ల ఈ సమస్య(Lice Gnawer) వస్తుందని చాలామంది అనుకుంటారు.
కానీ సైంటిఫిక్‌గా, మెడికల్ పరంగా చూసినా కూడా దానిలో ఎలాంటి నిజం లేదని డాక్టర్లు చెబుతున్నారు. పేను లేదా బొద్దింక కుట్టడం, కొరకడం వల్ల అసలు జుట్టు ఊడిపోదు. మెడికల్ భాషలో ఎలోపేషియా అరేటా అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి మన బాడీలోని ఇమ్యూన్ సిస్టం లోపల జరిగే ఒక చిన్న కన్ఫ్యూజన్ వల్లే ఇదంతా జరుగుతుంది. మన శరీరాన్ని రక్షించాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ కొన్నిసార్లు పొరపాటు పడుతుంది. బయటి నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడాల్సింది పోయి, మన సొంత జుట్టు కుదుళ్లనే శత్రువులుగా భావించి సడన్ అటాక్‌కు దిగుతుంది. దీనినే ఆటోఇమ్యూన్ కండిషన్ అంటారు. ఈ దాడి వల్లే వెంట్రుకల కుదుళ్లు ఒక్కసారిగా వీక్ అయి టెంపరరీగా నిద్రలోకి జారిపోతాయి. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న జుట్టు అంతా గుత్తులు గుత్తులుగా రాలిపోయి, ఆ ప్లేస్ అంతా నునుపుగా తయారవుతుంది.
ఇది రావడానికి మెయిన్‌గా అధిక ఒత్తిడి, ఆందోళన, వర్క్ ప్రెజర్, అతిగా ఆలోచించడం, నిద్రలేమి వంటివి ఈ సమస్యను మరింత స్పీడ్‌గా ట్రిగ్గర్ చేస్తుంటాయి. అలాగే ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లెమ్ ఉంటే జెనెటిక్‌గా కూడా కొందరికి ఇది సోకే అవకాశం ఉంటుంది. వీటితో పాటు బాడీలో పోషకాహార లోపం, థైరాయిడ్ వంటి సమస్యలున్నవారిలో కూడా ఇది(Lice Gnawer) కనిపించే ఛాన్స్ ఉంది.
పేనుకొరుకుడు కనిపించగానే కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్, ఆయింట్మెంట్స్ వాడటం కంటే, డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. డాక్టర్లు ఇచ్చే క్రీములు లేదా అవసరమైన మెడిసిన్ ద్వారా జుట్టు తిరిగి వచ్చేలా చేయొచ్చు. దీని నుంచి పూర్తిగా బయటపడాలంటే మాత్రం మెంటల్ ప్రెజర్‌ను తగ్గించుకోవడం చాలా ముఖ్యం.
యోగా, మెడిటేషన్ చేయడం వల్ల హార్మోన్ల బ్యాలెన్స్ మెరుగవుతుంది. అలాగే ఫుడ్‌లో ఆకుకూరలు, ప్రొటీన్లు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. చాలామంది ఆనియన్ రసం రాస్తుంటారు. అది రక్తప్రసరణను పెంచడానికి కొంతవరకు సహాయపడినా.. సెన్సిటివ్ స్కిన్ ఉండే ప్రాంతంలో మంట పుట్టించే అవకాశం ఉంటుంది. పేను కొరుకుడు అనేది పర్మినెంట్‌గా ఉండిపోయే ప్రాబ్లెమ్ కాదు..కుదుళ్లు పూర్తిగా నశించవు కాబట్టి సరైన పోషణ, మెడిసిన్‌తో కొద్ది నెలల్లోనే మళ్లీ పాత జుట్టు వస్తుంది.
Relationship Needs : అవసరాల చుట్టూ తిరిగే మనుషులు.. ఈ ప్రవర్తన వెనుక ఉన్న సైకాలజీ సీక్రెట్
