Pawan Kalyan
అందరికీ పవన్ కళ్యాణ్ అంటే ఒక పేరే కావొచ్చు. కానీ కొణిదెల పవన్ కళ్యాణ్ అంటే ఎంతోమందికి ఒక ఎమోషన్.. ఫ్యాన్స్‌కు మాత్రం దేవుడు. అవును.. అది అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటే పవన్‌కు మాత్రం భక్తులుంటారని సెలబ్రెటీలు కూడా ఓపెన్‌గా ఒప్పుకునే నిజం . అందుకే ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లలో ఈలలు, కేకలతో హాల్ దద్దరిల్లిపోతుంది. అదే ఆయన మైక్ పట్టుకుని మాట్లాడితే పొలిటికల్ గ్రౌండ్‌లో ప్రత్యర్థులకు కొద్దిరోజుల పాటు నిద్రే ఉండదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది గుండెల్లో పవన్ ఒక ట్రెండ్ సెట్టర్, ఒక వ్యవస్థ, ఒక ఎమోషన్. సినిమా హిట్,ఫట్‌తో సంబంధం లేకుండా ఇన్నేళ్లుగా అభిమానుల గుండెల్లో పాగా వేసుకుని కూర్చోవడం అంటే హీరోలకు అది చిన్న విషయం కాదు. అలా సెప్టెంబర్ 2న బర్త్ డే జరుపుకొంటున్న పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫుల్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రయాణాన్ని చూస్తే ఎవరైనా ఒకింత ఈర్ష్య పడాల్సిందే. పుడితే పవన్‌లా పుట్టాలి. బతికితే ఆయనలా బతకాలని కోరుకునేవారు చాలామందే ఉన్నారు.
మెగాస్టార్ తమ్ముడు అనే గుర్తింపుతోనే తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనదైన మార్షల్ ఆర్ట్స్ యాక్షన్, స్వాగ్, సొసైటీని ఆలోచింపజేసే యాటిట్యూడ్‌తో ..పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్‌ను సొంతంగా నిర్మించుకున్నారు.
1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో మొదలైన పవన్ ప్రభంజనం.. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల జాతరను క్రియేట్ చేసింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ సినిమాలతో ట్రెండ్‌ను సెట్ చేస్తూ, కేవలం యాక్టర్‌గానే కాకుండా డైరెక్టర్, స్క్రీన్‌ప్లే ,రైటర్, స్టంట్ మాస్టర్ ఇలా తన మల్టీ టాలెంట్‌తో ఎంతోమందికి రోల్ మోడల్‌గా మారిపోయారు.
అయితే వేల కోట్ల సినీ మార్కెట్, తిరుగులేని స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి మరీ..ప్రజాసేవే నా ఊపిరి అని 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పుడు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా ఎదురయ్యాయి. కానీ ఎదురుదెబ్బలు తగిలినా, ఓటములు పలకరించినా వెనక్కి తగ్గకుండా నిలబడిన పవన్ గట్స్ .. రైతులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, యువత కోసం రోడ్డెక్కి వారి పక్షాన పోరాడిన తీరు ఏపీ రాజకీయ సమీకరణాలనే మార్చేసింది.
2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి.. చారిత్రాత్మక విజయంతో ప్రభంజనాన్ని సృష్టించారు. ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్రను పోషించి, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ పొలిటికల్ గ్రాఫ్ ఎవరూ ఊహించని రేంజ్‌కు దూసుకెళ్లింది.
పంచాయతీ రాజ్, అటవీ, పర్యావరణ శాఖ , గ్రామీణాభివృద్ధి మంత్రిగా పవన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, అర్ధరాత్రి కూడా గ్రౌండ్ లెవెల్‌లో పర్యటిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్న పవన్‌ను చూసి విపక్షాలే కాదు సొంతపార్టీ నేతలు కూడా నోరెళ్లబెడుతున్నారు.ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో పవన్ తీసుకువచ్చిన ప్రగతిని.. చూసి చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకూ ఆయనను తమ దైవంగా గుండెల్లో గుడి కట్టుకున్నారు.
థియేటర్లలో కలెక్షన్ల సునామీని సృష్టించిన పవర్ స్టార్, ఇప్పుడు పవర్ ఫుల్ డెప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి తానొక ఆయుధంగా మారి చరిత్రను తిరగరాస్తున్నారు. ఈ బర్త్‌డే సందర్భంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరింత శక్తివంతంగా, మరెన్నో ఏళ్లు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని కోరుకుందాం.
Breakup Pain : బ్రేకప్ పెయిన్ తగ్గడం లేదా? ఫేక్ ఐడీలతో మాజీలను ట్రాక్ చేస్తున్నారా?
