Pawan Kalyan: నెట్టింట మారుమోగుతున్న పవన్ కళ్యాణ్‌ మాటలు..

Pawan Kalyan: కేవలం 48 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడం వెనుకున్న పట్టుదల గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటోంది.

Pawan Kalyan

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ గురించే చర్చ జరుగుతోంది. పవన్ మాట్లాడిన ప్రతి మాటా ఒక తూటాలా పేలుతోంది.

ముఖ్యంగా తెలుగు మూవీ పోస్టర్లను పక్క రాష్ట్రాల్లో చించేసినా, మనం మాత్రం కాంతారా లాంటి సినిమాలను నెత్తిని పెట్టుకున్నామంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు అన్ని భాషల సినీ అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి.

సినిమా అనేది భాషలకు, ప్రాంతాలకు అతీతమని, దాన్ని ఒక చిన్న గీత గీసి విడదీయొద్దని పవన్ అన్న మాటలు ఇప్పుడు నేషనల్ లెవల్‌లో వైరల్ అవుతున్నాయి. అసలు ఆ స్పీచ్ ఇంతలా వైరల్ అవ్వడానికి దీనికి అందులో ఉన్న నిజాయితీ.

సినిమా తనకు అన్నం పెట్టింది.. ప్రజలకు సేవ చేసే దారిలోకి తనను తీసుకెళ్లిందని చెప్పారు. ఒక పక్క ఉప ముఖ్యమంత్రిగా తాను బిజీగా ఉండి కూడా.. కేవలం 48 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడం వెనుకున్న పట్టుదల గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటోంది.

వేరే నాయకులకు వ్యాపారాలున్నాయి. నాకు సినిమానే వృత్తి అని ఆయన చెప్పినప్పుడు వచ్చిన కేరింతలు నెట్టింట మారుమోగుతూనే ఉన్నాయి. కేవలం తన సినిమా మాత్రమే కాకుండా, అన్ని ఇండస్ట్రీలు బాగుండాలని కోరుకునే ఆయన విశాల హృదయం గురించి ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు.

Pawan Kalyan

దీనికి తోడు దర్శకుడు హరీష్ శంకర్ కమిట్‌మెంట్ ఉన్నోడికే కటౌట్ ఉంటుందనే మాట ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్ అయిపోయింది. శ్రీలీల డాన్స్ గురించి కాదు, తన నటన గురించి ఈ సినిమా తర్వాత మాట్లాడుకుంటారని పవన్ చెప్పిన హైప్, సినిమా మీద అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది.

ఉగాదికి విడుదలవుతున్న ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం ఒక మూవీ మాత్రమే కాదు. అది పవన్ కళ్యాణ్(Pawan Kalyan) డెడికేషన్ కు నిదర్శనమని ఆయన ఫ్యాన్స్ పోస్టులతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఈ స్పీచ్ ఉగాదికి రాబోయే బాక్సాఫీస్ సునామీకి ఒక పెద్ద సంకేతంలా కనిపిస్తోంది.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version