Pawan :పవన్, యష్, రణవీర్ సింగ్‌లో మార్చి మొనగాడు ఎవరు?

Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాఖీ భాయ్ యష్, బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్.. ఈ ముగ్గురిలో మార్చి మొనగాడెవరనే చర్చ ఇప్పుడే మొదలైపోయింది.

Pawan

ఫిబ్రవరి, మార్చి నెల వచ్చిందంటే కేవలం మండిపోయే ఎండలు మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి కూడా సెగలు పుట్టేలా అనిపిస్తోంది. మార్చి నెల మాత్రం సినీ ప్రియులకు .. అసలైన విందును వడ్డించబోతోంది.

ఈ నెలలో ముగ్గురు అగ్ర హీరోలు తమ భారీ చిత్రాలతో థియేటర్ల వద్ద యుద్ధానికి సిద్ధమయ్యారు. పవర్ స్టార్ పవన్(Pawan) కళ్యాణ్, రాఖీ భాయ్ యష్, బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్.. ఈ ముగ్గురిలో మార్చి మొనగాడెవరనే చర్చ ఇప్పుడే మొదలైపోయింది.

టాలీవుడ్ రికార్డులను తిరగరాయడానికి పవన్ కళ్యాణ్ తన ఉస్తాద్ భగత్ సింగ్‌తో రాబోతున్నారు. హరీష్ శంకర్ డైరక్షన్ గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఇప్పటికే రిలీజైన ప్రోమోలు పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ యాటిట్యూడ్‌ను చూపిస్తూ ఫ్యాన్స్‌కు ఇప్పటికే పూనకాలు తెప్పిస్తున్నాయి.

మార్చి 26న ఈ మూవీ రిలీజ్ అవనుండగా, ఒక రోజు ముందే అంటే మార్చి 25 నుంచే భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, పవన్ కళ్యాణ్ ఈ వేసవికి అదిరిపోయే ఆరంభాన్నివ్వడం గ్యారంటీగా కనిపిస్తోంది.

కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్, ఇప్పుడు టాక్సిక్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. రాకీ భాయ్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి, అంతకు మించిన పవర్‌ఫుల్ రోల్‌లో యష్ కనిపించబోతున్నారు.

ఈ సినిమా టీజర్ చూస్తుంటే రక్తం ఏరులై పారుతుందని, యాక్షన్ లవర్స్‌కు ఇది ఒక పెద్ద పండుగే అవుతుందని అనిపిస్తోంది.  తెలుగులో ఈ మూవీని అగ్ర నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తుండటం విశేషం. మార్చి 19న ఈ యష్ మూవీ రిలీజ్ కాబోతోంది.

Pawan

బాలీవుడ్ లెక్కలను మార్చేస్తూ సంచలన విక్టరీ సాధించిన దురంధర్ మూవీకి.. సీక్వెల్‌గా దురంధర్ 2 కూడా వస్తోంది. రణవీర్ సింగ్ తనదైన శైలిలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే యష్ నటించిన టాక్సిక్ అలాగే రణవీర్ నటించిన ‘దురంధర్ 2’ రెండూ కూడా మార్చి 19నే రిలీజవుతున్నాయి. అంటే ఒకే రోజు ఇద్దరు పాన్ ఇండియా స్టార్ల మధ్య.. బాక్సాఫీస్ పోరు జరగబోతోంది.

ఈ భారీ మూవీలతో పాటు మృత్యుంజయ్, సంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని, బ్యాండ్ మేళం, సరస్వతి, సతీ లీలావతి వంటి మరికొన్ని వైవిధ్యమైన చిన్న బడ్జెట్ సినిమాలు కూడా మార్చిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

ముందుగా యష్ , రణవీర్ సింగ్ మధ్య పోటీ మొదలైతే, వారం రోజుల గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌గా బాక్సాఫీస్ వద్ద ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ముగ్గురిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మార్చి మొనగాడిగా ఎవర నిలుస్తారో చూడాలి.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version