Peddi
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన పెద్ది మూవీ.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో, కేవలం ఐదు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్‌ను క్రాస్ చేసి.. సరికొత్త మైలురాయిని అందుకుంది. దీంతో సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా పెద్ది కలెక్షన్ల హవా గురించే చర్చ సాగుతుంది.
రిలీజైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 135.36 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లతో ఓపెనింగ్స్ తెరిచిన పెద్ది, అదే ఊపుతో ఐదో రోజు ముగిసేసరికి మొత్తంగా 315 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మూవీ మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
రానున్న రోజుల్లో ఈ మూవీ కలెక్షన్ల జోరు పాత రికార్డులను తుడిచిపెట్టేలా కనిపిస్తోందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.
పెద్దిలోని పల్లెటూరి వాతావరణం, రామ్‌చరణ్ ఊరమాస్ యాక్షన్.. థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి.
కాగా పెద్ది మూవీ సాధిస్తున్న విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా స్పందిస్తూ.. రామ్‌చరణ్ పెర్ఫార్మెన్స్ చూసి ఎంతో గర్వపడుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన పెద్ది మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా పెద్దగా మార్కులు కొట్టకపోయినా.. జగపతి బాబు, బొమన్ ఇరానీ, రవి కిషన్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో మెరవడం ఈ చిత్రానికి హైలైట్ అయింది.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వచ్చిన ఈ సినిమా.. లాంగ్ రన్‌లో మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
BOX OFFICE CHAMPION #PEDDI continues his dominance 🔥🔥#Peddi collects a gross of over 315 CRORES + GROSS WORLDWIDE in 5 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/e5fZ2thleb
— PEDDI (@PeddiMovieOffl) June 9, 2026
Sleep : నిద్ర తక్కువైతేనే కాదు.. ఎక్కువైనా ప్రమాదమే..డాక్టర్లు ఏం చెబుతున్నారు?
