Peddi Movie
జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న రామ్ చరణ్ పెద్ది మూవీ(Peddi Movie) కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కు, బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలకు రేవంత్ సర్కార్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. భారీ బడ్జెట్‌తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ యూనిట్ రిక్వెస్ట్‌తో టికెట్ రేట్లు పెంచుకోవడానికి, అలాగే స్పెషల్ షోలు వేసుకోవడానికి అధికారికంగా అనుమతులు లభించాయి. ఉప్పెన వంటి భారీ హిట్ తర్వాత వస్తున్న బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ(Peddi Movie) ప్రాజెక్ట్ కావడంతో, ఈ మూవీ ఓపెనింగ్స్ కలెక్షన్లకు ఈ నిర్ణయం ప్లస్ అవ్వనుంది.
గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవో ప్రకారం.. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న స్పెషల్ ప్రీమియర్ షోల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఈ ప్రీమియర్ షోలకు సంబంధించిన ఒక్కో టికెట్ ధరను రూ.600 గా నిర్ణయించారు.
అలాగే థియేటర్లలోకి వెళ్లి చూసే రెగ్యులర్ షోల రేట్లు కూడా మారాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో నార్మల్ టికెట్ రేటుపై ఎక్స్‌ట్రాగా రూ.100 వరకు, అలాగే మల్టీప్లెక్స్‌లలో అయితే ఒక్కో టికెట్ ధరపై రూ.125 వరకు ఎక్స్‌ట్రా పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి కేవలం ఫస్ట్ పది రోజుల పాటు మాత్రమే ఈ పెంచిన ధరలు అమలులో ఉంటాయని ఉత్తర్వులతో క్లారిటీ ఇచ్చారు. ఆ పది రోజులు పూర్తి కాగానే, మళ్లీ ఎప్పటిలాగే పాత నార్మల్ ధరలకే టికెట్ల ధరలు ఉంటాయి.
ఒక భారీ బడ్జెట్ మూవీని థియేటర్లలోకి తెచ్చేటప్పుడు ప్రొడ్యూసర్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. భారీ రేట్లు పెట్టినా సరే ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ డే థియేటర్ల దగ్గర జాతర చేయడానికి గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు.
