Fauzi Glimpse : ప్రభాస్ ఫౌజీ గ్లింప్స్ విజువల్ వండర్..డార్లింగ్ ప్రభాస్ విద్వంసం స్టార్ట్..

Fauzi Glimpse : ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫైల్ నెం.25 ఫౌజీ ఒరిజినల్ గ్లింప్స్ విశేషాలు. నేతాజీ-హిట్లర్ సంభాషణ, ప్రభాస్ పవర్‌ఫుల్ రోల్, రిలీజ్ డేట్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Fauzi Glimpse

రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలను తెప్పించేలా.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్‌లో హెవీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ..ఫైల్ నెం.25 : ఫౌజీ నుంచి ఒరిజినల్ గ్లింప్స్‌ను మేకర్స్ ప్రభాస్ బర్త్‌ డే సందర్భంగా రిలీజ్ చేశారు.2 వందల ఏళ్ల నాటి భారత స్వాతంత్య్ర పోరాటాన్ని కళ్లకు కట్టేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వ్యూస్ రికార్డులను తిరగరాస్తూ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ , అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే ఇంట్రస్టింగ్‌గా లోతైన డైలాగ్స్‌తో ఈ గ్లింప్స్(Fauzi Glimpse )వేరే లెవెల్‌లో స్టార్టయింది. భారత దేశ సామర్థ్యాన్ని హిట్లర్ తక్కువ చేసి మాట్లాడినప్పుడు, భారతదేశపు స్వాతంత్య్రాన్ని సాధించి తీరుతామని బోస్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇక బ్రిటీష్ ఇంటెలిజెన్స్ సిస్టంను గడగడలాడించిన ఇండియన్ సైనికుడు, స్పై , గొప్ప స్ట్రాటజిస్ట్‌ ఫౌజీగా ప్రభాస్‌ని ఇంట్రడ్యూస్ చేసిన తీరు మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది.

జర్మన్ హిట్లర్ వాడిన ఫేమస్ ‘ఎనిగ్మా’ కోడ్ కంటే కూడా, ఇండియన్ ఫౌజీ భగవద్గీత బేస్ చేసుకుని క్రియేట్ చేసిన సీక్రెట్ కోడ్‌ను చేధించడం బ్రిటీషర్లకు అసాధ్యంగా మారిందనే పాయింట్ మూవీపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది.

అయితే ఈ వీడియో ఎండింగ్‌లో ప్రభాస్ తన బేస్ వాయిస్‌తో హే బ్రిటీషర్.. నీ రక్తాన్ని కళ్లజూసి నా దేశ స్వాతంత్య్రాన్ని బలంగా లాక్కుంటానటూ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ఈ గ్లింప్స్‌(Fauzi Glimpse )కే మెయిన్ హైలైట్‌ అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. హను రాఘవపూడి విజన్, విజువల్ గ్రాండ్‌నెస్ ఈ మూవీని పాన్ వరల్డ్ రేంజ్‌లో నిలబెడుతున్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ విజువల్ ఫీస్ట్ వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన వరల్డ్ వైడ్‌గా థియేటర్లను షేక్ చేయడానికి రెడీ అవుతుంది.

Decision : లైఫ్‌లో సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారా? కన్ఫ్యూజన్‌కు ఇలా చెక్ పెట్టండి..

↑
Exit mobile version