Ram Charan
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మాస్ జాతరకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు ముస్తాబవుతున్నాయి. ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత కోయబోతోందో చూపించడానికి సమయం ఆసన్నమైంది.
జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా వెండితెరపైకి రాబోతున్న ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న టికెట్ల వేట ఈరోజు నుంచే షురూ అయింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల నుంచి ప్రముఖ టికెటింగ్ యాప్ డిస్ట్రిక్ట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ విండో ఓపెన్ అయింది. తెలంగాణలోని థియేటర్లలో కూడా ఈరోజు సాయంత్రం లోపే టికెట్ల అమ్మకాలు స్టార్ట్ కాబోతున్నాయి.
థియేటర్లలో మొదటి రోజే, అది కూడా ఫస్ట్ షో పడగానే రామ్ చరణ్ రచ్చను ..కళ్లారా చూడాలని ఫిక్స్ అయిన ఫ్యాన్స్..ప్రీమియర్ షో అండ్ ఫస్ట్ షోల బుకింగ్స్ కోసం ఇప్పుడే అలర్ట్ అయిపోయారు.
ఈ మూవీలో రామ్ చరణ్(Ram Charan) సరసన బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారు. వీళ్లతో పాటు జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి హేమాహేమీలు ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.
ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఈ విజువల్ వండర్‌కు మెయిన్ పిల్లర్‌గా నిలుస్తుందని ఇప్పటికే టాక్ నడుస్తోంది. టాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ కలిసి అద్భుతంగా తెరకెక్కించిన ఈ పెద్ది మూవీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక జూన్ 4న పెద్ది బాక్సాఫీస్ రికార్డులను ఎలా తిరగరాస్తాడో చూడాలి మరి.
India ,Nepal మళ్లీ తెర మీదకు భారత్-నేపాల్ సరిహద్దు వివాదం.. లిపులేఖ్ మార్గం భారత్‌కు ఎందుకంత కీలకం?
