Peddi
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది(Peddi ). మూవీ లవర్స్, మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ మే 18న విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రైలర్ కట్ చూస్తుంటే.. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ మల్టీ స్పోర్ట్స్ రూరల్ యాక్షన్ డ్రామా అని క్లారీటీగా అర్థమవుతోంది.
దీనిలో రామ్ చరణ్ రోల్ ను ఒక పవర్‌ఫుల్ క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, చిన్న చిన్న గ్లింప్స్ వీడియోలలో చెర్రీని ఒక క్రికెటర్‌గా, రెజ్లర్‌గా హింట్ ఇచ్చిన మూవీ టీం.. ఈ తాజా ట్రైలర్‌తో ఆయన ఒక అథ్లెట్‌గా ట్రాక్‌పై పరిగెత్తబోతున్నారనే అసలు విషయాన్ని రివీల్ చేసేసింది. దీంతో పెద్ది మూవీ లైన్ ఇదే అయ్యుంటుంది అంటూ నెటిజన్లు, సినీ క్రిటిక్స్ తమకు నచ్చినట్లుగా కథలు అల్లేస్తున్నారు. ఈ ట్రైలర్ చివర్లో ఒక షాకింగ్ ట్విస్ట్‌ను కూడా మేకర్స్ సీక్రెట్‌గా దాచినట్లు అనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.
పెద్ది(Peddi) సినిమా స్టోరీ, చరణ్ క్యారెక్టరైజేషన్ గురించి ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ టాక్ నడుస్తోంది. తన ఫస్ట్ మూవీ ‘ఉప్పెన’లోనే ఎవరూ ఊహించలేని షాకింగ్ క్లైమాక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన బుచ్చిబాబు.. ‘పెద్ది’ సినిమాలో కూడా అలాంటి ఒక గుండెలు పిండేసే ఎమోషనల్ ఎండింగ్‌ను ప్లాన్ చేశారనే న్యూస్ వైరల్ అవుతోంది.
సినిమాలో ఒక యాక్సిడెంట్‌లో హీరో తన రెండు కాళ్లను కోల్పోతాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ట్రైలర్‌లో నేరుగా చూపించకపోయినా.. ట్రైలర్ ఎండింగ్‌లో పెద్ది మళ్లీ తన కాళ్లతో తిరిగి వచ్చాడనే అర్థం వచ్చేలా ఇంగ్లీష్‌లో వినిపించే బ్యాక్‌గ్రౌండ్ డైలాగ్ ఈ రూమర్లకు బలాన్ని చేకూరుస్తోందన్న టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే కనుక థియేటర్లలో ఆడియన్స్‌కు ఒక ఎమోషనల్ హార్ట్ బ్రేకింగ్ సీన్ గ్యారెంటీ అని, చరణ్ లాంటి మాస్ హీరోతో బుచ్చిబాబు సానా ఇలాంటి డిఫరెంట్ పాయింట్‌ను ఎలా హ్యాండిల్ చేశారనేది క్యూరియాసిటీగా మారింది.
ఈ ప్రచారానికి తోడు చరణ్ దీనిలో ఒక పారా అథ్లెట్ గా కనిపిస్తారనే సరికొత్త లీక్ కూడా సోషల్ మీడియాలో నిన్నటి నుంచి హల్ చల్ చేస్తోంది. ట్రైలర్‌ను క్లియర్‌గా కనుక గమనిస్తే.. చెర్రీ తన పుట్టిన తేదీని సూచించే ’27’ నంబర్ జెర్సీ ధరించి అథ్లెటిక్ ట్రాక్‌పై బరిలోకి దిగినప్పుడు,చరణ్ కాస్త కుంటుతూ అడుగులు వేయడాన్ని చూడొచ్చు. ఇది చూశాకే ఫ్యాన్స్ ఈ రూమర్స్ నిజమేనంటూ మరింత కన్ఫమ్ చేసేసుకుంటున్నారు.
దీనికి తోడు డైరెక్టర్ బుచ్చిబాబు ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ.. ఈ సినిమా చివరి 50 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఉంటుందని.. ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా డిస్టర్బ్ అవుతారని స్టేట్‌మెంట్ ఇచ్చారు. బుచ్చిబాబు మాటలను, ఈ ట్రైలర్ విజువల్స్‌ను లింక్ చేస్తూ.. ఆ 50 నిమిషాల ఎమోషన్‌కు రీజన్ హీరో పారా అథ్లెట్‌గా మారడమేనని కామెంట్లు పెడుతున్నారు. ఒక స్టార్ హీరో ఇలాంటి డేరింగ్ రోల్ చేయడం నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటూ చెర్రీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఇక పెద్ది (Peddi) మూవీ మేకింగ్ విషయానికి వస్తే.. డైరెక్టర్ బుచ్చిబాబు 1980ల కాలం నాటి ఒక సరికొత్త వింటేజ్ ప్రపంచాన్ని ఆడియన్స్ కళ్లముందుకు తీసుకురాబోతున్నారు. పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్‌తో సాగే పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఆ కాలం నాటి గ్రామీణ క్రీడలు, పంతాలు, పట్టింపులు, అప్పటి మనుషుల జీవన విధానాన్ని చాలా నేచురల్‌గా చూపించబోతున్నారు. అలాగే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ మూవీలో పూర్తి రస్టిక్ లుక్‌లో కనిపించడం కోసం తన బాడీని పూర్తిగా మేకోవర్ చేసుకున్నారు.
Registration:ఆ భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..ఇంటి పన్ను రశీదు ఉంటే చాలు
